Infinix Note 40 5G: 5,000mAh బ్యాటరీతో రూ.15 వేలకే Infinix Note 40 మొబైల్ రాబోతోంది.. ఫీచర్స్ వివరాలు ఇవే!
Infinix Note 40 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? త్వరలోనే Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Note 40 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ (Infinix) నుంచి మార్కెట్‌లోకి మంచి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్‌ఫినిక్స్ కంపెనీ ఈ మొబైల్‌ను Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ పేరుతో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ జూన్ 21న భారతదేశంలో గ్రాండ్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే కంపెనీ దీనిని మొదట ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఆ తర్వాత కంపెనీ స్టోర్స్‌లో లభించనున్నాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధర వివరాలు:
ఇన్‌ఫినిక్స్ కంపెనీ ఈ Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధరను కూడా అధికారంగా వెల్లడించింది. అయితే ఈ ధర వేరియంట్‌ల వారిగా ఉన్నాయి. కంపెనీ దీనిని ధర రూ.15,999 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ మొబైల్‌ను మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.3,500 వరకు తగ్గింపు లభించే ఛాన్స్ కూడా ఉంది.
ఈ Infinix Note 40 5G మొబైల్‌కి సంబంధించిన టాప్ వేరియంట్‌కు సంబంధించిన ధర వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారు రూ.1,333 నెలకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15,000 నుండి రూ.20,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
120Hz రిఫ్రెష్ రేట్
6.78-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
MediaTek Dimensity 7020 చిప్‌సెట్
108MP OIS ప్రైమరీ కెమెరా
2MP అదనపు కెమెరా
32MP ఫ్రంట్ కెమెరా
45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
20W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
5,000mAh బ్యాటరీని ప్యాక్
Android 14-ఆధారిత XOS 14
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి