Infinix Note 40 Pro Plus 5G: అద్భతమైన గోల్డ్ ప్రేమ్ డిజైన్‌తో Infinix Note 40 Pro Plus లాంచ్.. ధరకు, ఫీచర్స్‌కి సంబంధమే లేదు!
Infinix Note 40 Pro Plus 5G Price: మార్కెట్‌లోకి ఇన్‌ఫినిక్స్ తమ శక్తివంతమైన infinix note 40 pro plus, Note 40 Pro స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Infinix Note 40 Pro Plus 5G Price: మిడ్ రేంజ్ మొబైల్‌ను మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను అతి తక్కువ ధరలకే లాంచ్ చేస్తోంది. ఇలా విడుదల చేసే మొబైల్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభిస్తోంది. అయితే ఈ ఇన్‌ఫినిక్స్ తమ కస్టమర్స్‌కి మరో గుడ్ న్యూస్ తెలిపింది. మిడ్ రేంజ్ లోనే ఎంతో శక్తివంతమైన Infinix Note 40 Pro+ 5G, Note 40 Pro మొబైల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ 6.78 అంగుళాల పూర్తి HD ప్లస్ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది ఎన్నో ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండు మోడల్స్ బ్యాక్ సెటప్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాకుండా ఇన్‌ఫినిక్స్ కంపెనీ వీటి రెండింటిని చీతా X1 చిప్‌తో మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ మోడల్స్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు ఈ రెండిటిలో 40 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7020 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇక Note 40 Pro మొబైల్ MediaTek Helio G99 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది.
రెండు మోడల్స్ ధరలు:
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో పస్ 5G మోడల్ మార్కెట్‌లో ధర $309 (సుమారు రూ. 25,000) నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మొబైల్‌ను కంపెనీ అబ్సిడియన్ బ్లాక్, వింటేజ్ గ్రీన్ కలర్ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక Note 40 Pro స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే, ధర $289 (సుమారు రూ. 24,000) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మొబైల్ ఎంతో ఆకర్శనీయమైన హారిజన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు ప్రిమయం లుక్ కనిపించేందుకు బ్యాక్ సెటప్‌లో అదిరిపోయే డిజైన్‌ను కలిగి ఉంటుంది.
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో పస్ 5G స్పెసిఫికేషన్‌లు:
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో పస్ 5G స్మార్ట్‌ఫోన్ అప్డేటేడ్ వేరియంట్ Android 14-ఆధారిత XOS 14పై రన్ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ అదనంగా రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పూర్తి-HD ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు దీని స్క్రీన్ 1,080x2,436 పిక్సెల్‌కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ 6nm MediaTek డైమెన్సిటీ 7020 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుందని ఇన్‌ఫినిక్స్ పేర్కొంది.
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 Pro+ 5G కెమెరా:
ఇన్‌ఫినిక్స్ లాంచ్ చేసిన నోట్ 40 Pro+ 5G మోడల్ ప్రీమియం కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా దీని బ్యాక్ సెటప్‌లో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అదనపు కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉండే ప్రధాన కెమెరా 3x జూమ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. దీంతో కంపెనీ సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రాంట్ కెమెరాను అందిస్తోంది. ఇవే కాకుండా మరెన్నొ ఫీచర్స్‌ను కలిగి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి