Infinix Smart 8 5G New Variant Price: ప్రముఖ టెక్‌ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌ భారత్‌లో స్మార్ట్ 8 ప్లస్‌ను లాంచ్‌ చేసింది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు కొత్త లుక్‌లో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. కంపెనీ గత నెల నుంచి దీనికి సంబంధించిన విక్రయాలు ప్రారంభించింది. Infinix మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 4GB ర్యామ్‌ 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌లో విడుదల చేయగా..ఈ కాన్ఫిగరేషన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కొత్త వేరియంట్‌ ఫీచర్స్‌ ఏంటో..కంపెనీ దీనిని ఏయే ధరలో విక్రయిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త వేరియంట్ ధర:
గత నెలలో విడుదలైన ఈ Infinix Smart 8 స్మార్ట్ ఫోన్‌  4GB ర్యామ్‌, 64GB స్టోరేజ్‌తో అందుబాటులోకి రాగా.. కొత్త వేరియంట్‌లో లభించే Infinix Smart 8 స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇది గెలాక్సీ వైట్, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్స్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ విక్రయిస్తోంది. ఈ కొత్త వేరియంట్ (8GB RAM + 128GB) ధర  రూ. 7,499తో అందుబాటులో ఉంది. 


ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకత:
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8లో  ర్యామ్, స్టోరేజ్ కాకుండా అన్ని పాత వేరియంట్‌లో ఉండే ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇందులో 6.6 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేతో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. దీంతో పాటు ఈ డిస్ల్పే 500 నీట్స్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా యాపిల్‌ 15లో ఉండే వంటి డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా ఫోన్‌కి నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


ఈ స్మార్ట్‌ ఫోన్‌ పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో డ్యుయల్‌ కెమెరాలతో రాబోతోంది. ఇందులో50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు సెల్పీ, వీడియో కాలింగ్ కోసం ఫ్రాంట్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ Helio G36 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్‌ అవుతుంది. దీంతో పాటు కంపెనీ అనేక కనెక్టీవిటీలను అందిస్తోంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter