iPhone 13 Lowest Price Ever in Flipkart Big Saving Days 2022: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' జరుగుతోంది. క్రిస్టమస్ 2022 సందర్భంగా ఈ సెల్ డిసెంబర్ 16న ఆరంభం అయింది. డిసెంబర్ 21 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతుంది. ఈ సెల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు మరియు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ఉంది. అయితే సేల్ ప్రారంభంకాగానే అందరి దృష్టి ఐఫోన్ 13పైనే ఉంది. ఎందుకంటే.. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై ఉన్న ఆఫర్‌లను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 శాతం తగ్గింపు:
ఐఫోన్ 13 (APPLE iPhone 13 5G, Midnight, 128 GB) అసలు ప్రారంభ ధర రూ. 69,900. అయితే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్ రూ. 62,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 13పై ప్రస్తుతం 9 శాతం తగ్గింపు ఉంది. దాంతో రూ. 69,900 ఈ ఫోన్.. రూ. 62,999కి కొనుగోలుదారులకు లభించనుంది. APPLE iPhone 13 5G (Starlight, 128 GB), APPLE iPhone 13 5G (Blue, 128 GB), APPLE iPhone 13 5G (Green, 128 GB), APPLE iPhone 13 5G ((PRODUCT)RED, 128 GB)లపై కూడా ఇదే ఆఫర్ ఉంది. APPLE iPhone 13 5G 256 GBలపై మాత్రం 12 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.


క్రెడిట్ కార్డ్‌ ఆఫర్:
ఐఫోన్ 13 (APPLE iPhone 13 5G, Midnight, 128 GB)పై బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. iPhone 13ని కొనుగోలు చేయడానికి Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు రూ. 3,150 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఈ ఫోన్ ధర రూ. 59,849గా ఉంది. 


ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌:
ఐఫోన్ 13పై రూ.17,500 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే మీ ఫోన్ కండిషన్ బాగుండి, సరికొత్త మోడల్ అయితేనే రూ.17,500 తగ్గింపు లభిస్తుంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్ వర్తిస్తే.. ఈ ఫోన్ ధర రూ. 42,349గా ఉంటుంది. మొత్తంగా ఈ ఫోన్‌పై దాదాపు 27 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది.


Also Read: FIFA World Cup 2022 Prize Money: ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతకు ఊహించని ప్రైజ్‌మనీ.. తెలిస్తే షాకే! అవార్డుల లిస్ట్ ఇదే  


Also Read: Mercury Rise 2023: జనవరి 12న ధనుస్సు రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి శుభప్రదం! కొత్త ఉద్యోగం, వ్యాపారంలో భారీ ఆదాయం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.