iPhone 15 Online Shopping: యాపిల్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. Apple iPhone15 పై ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో రూ. 60 వేల భారీ తగ్గింపును పొందవచ్చు. అయితే ప్రస్తుతం యాపిల్ సంస్థ iPhone 15 సిరీస్ కోసం ముందస్తు ఆర్డర్‌లను స్వీకరిస్తున్నారు. అధికారికంగా ఈ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబరు 22న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇండియాలోని యాపిల్ సంస్థ రిటైల్ అవుట్ లెట్స్ అయిన ఢిల్లీ, ముంబయిలలో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకు ఆఫర్స్..
యాపిల్ ఇండియా ద్వారా ఐఫోన్ 15పై HDFC బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్ ను పొందవచ్చు. అంతేకాకుండా.. యాపిల్ వెబ్ సైట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయడం ద్వారా రూ. 6 వేల వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. 


ఐఫోన్ 15తో పాటు ఇతర ఉత్పత్తులపై వరుస డిస్కౌంట్స్ ను యాపిల్ సంస్థ ప్రకటించింది. iPhone 15 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 74,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయోచ్చట. అయితే దీన్ని మార్కెట్లో రూ. 79,900 ధరకి విక్రయించనున్నారు. అలాగే రూ. 89,900 విలువైన ఐఫోన్ 15 Plus తగ్గింపు ధరతో రూ. 84,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. మరోవైపు ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900గా నిర్ణయించగా.. తగ్గింపు తర్వాత ఈ మొబైల్ ను రూ. 1,28,900 ధరకే కొనొచ్చు. చివరిగా రూ. 1,59,900 ధరకి విక్రయిస్తున్న iPhone 15 Pro Maxని రూ. 153,900కి కొనుగోలు చేయవచ్చు.


Amazonలో Apple iPhone 15 సిరీస్‌పై తగ్గింపు
అమెజాన్ లో ఉంచిన నివేదికల ప్రకారం.. iPhone 15 ప్రీ - ఆర్డర్లు రూ. 89,900 నుంచి ప్రారంభం కానున్నాయి. 1TB ప్రో స్టెప్స్ రూ. 1,84,900 గా ఉంది. అంతేకాకుండా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 5,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 


Also Read: Selling Your Used Car: మీ పాత కారుకు మంచి ధర రావాలంటే ఏం చేయాలో తెలుసా ?


ఫ్లిప్‌కార్ట్‌లో Apple iPhone 15పై తగ్గింపు
ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, అన్ని రకాల మోడల్స్ అందుబాటులో లేవు. ఎంపిక చేసిన HDFC కార్డ్‌ల ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు.


ఐఫోన్ 14పై డిస్కౌంట్..
మరోవైపు, Apple iPhone 14 పై భారీ తగ్గింపు తర్వాత రూ. 65,900 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. iPhone 14 Plus రూ. 79,900 ధఱ ఉండగా.. ఇప్పడు అది 75,900 రూపాయలకు విక్రయానికి ఉంది.
ఐఫోన్ 13 ఇప్పుడు రూ. 59,900 ధరకి విక్రయిస్తుండగా.. ఇప్పుడు ఆఫర్ తర్వాత ఇది రూ. 56,900 తగ్గింపు అందుబాటులో ఉండనుంది. అలాగే SE మోడల్ రూ. 47,990 కొనుగోలుకు ఉంది. యాపిల్ వాచ్ 9 సిరీస్ ను రూ. 39,400గా.. యాపిల్ వాచ్ ఆల్ట్రాను రూ. 86,900గా విక్రయిస్తున్నారు. 


ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్ తో పాటు మరెన్నో ఉత్పత్తుల శ్రేణిపై కూడా ఆపిల్ డిస్కౌంట్లను ప్రకటించింది. iPad Pro మోడల్‌లు, iPad Air సహా వివిధ iPad వెర్షన్‌లపై కస్టమర్‌లు రూ. 4,000 వరకు పొదుపు పొందవచ్చు.


Also Read: Realme C53 Price: రూ.14 వేల స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.649 ధరకే కొనేయండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook