Iphone 14 Plus Sale: చిన్న ఐఫోన్‌లకు బదులుగా యాపిల్‌ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఐఫోన్ 14 ప్లస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వినియోగదారులకు నచ్చిన కొత్త ఫీచర్లతో మార్కెట్‌లో లాంచ్‌ అయ్యింది. ఇప్పుడున తరానికి గాను ఐఫోన్‌ 14 యూజర్లకు సరిపోతుంది. యాపిల్ ఫోన్‌లో పెద్ద స్క్రీన్ కావాలనుకునేవారు తప్పకుండా  ఐఫోన్ 14 ప్రో మాక్స్ కొనుగోలు చేయోచ్చు. ఐఫోన్‌లో ఫీచర్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటి రేట్లు చాలా అధికం. చాలా మంది వీటిని కొనాలనే కోరికలుంటాయి. కానీ రేట్లు ఎప్పటికప్పుడు పెరగడం వల్ల కొనలేకపోతున్నారు. అయితే ప్రో మాక్స్ వేరియంట్‌ కొనాలనుకునేవారు బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఫోన్‌ కొనుగోలు చేయాలి. ఇలా కొనుగోలు చేస్తే చౌకగా ఫోన్‌ లభిస్తుంది. ఐఫోన్ 14 వేరియంట్‌ ఫోన్‌ వెరిజోన్ సైట్‌లో కేవలం $360 (రూ. 29,361)కి విక్రయిస్తోంది. అయితే కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లాక్ ఫ్రైడే డీల్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ తగ్గింపు:
బ్లాక్ ఫ్రైడే డీల్‌లో iPhone 14 Plus 128GB వేరియంట్ రిటైల్ ధర $899 (రూ. 73,323) అయితే వెరిజోన్ వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. దాదాపు మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌పై $ 539 (రూ. 43,991) దాకా ఫ్లాట్ డిసౌంట్‌ పొందవచ్చు. దీంతో ఐఫోన్ 14 వేరియంట్‌ ధర గరిష్టంగా $899 నుంచి కనిష్టంగా $360కి (రూ. 29,361) తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఈ మీరు ఈ డిస్కౌంట్స్‌ను పొందాలనుకుంటే తప్పకుండా కొన్ని అర్హతలు, షరతులు పాటించాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌కు బదులుగా ముందుగా మీరు వెరిజోన్ నుంచి కొత్త లైన్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు తక్కువ తగ్గింపును పొందేందుకు తమ ప్లాన్‌లను ఈ అపరిమిత ప్లాన్‌లకు అప్‌గ్రేడ్ చేసుకోవాలి.


ఈ డిస్కౌంట్‌ పొందాలనుకుంటే పెద్ద మొత్తంలో ప్రసెస్‌ ఉంటుంది. మీరు ఈ ఫోన్‌ను వెరిజోన్ తీసుకుంటే ఒకే సారి డబ్బులు చెల్లించని వారు పలు దఫాల చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల $10 (రూ. 816) ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో మీకు సున్నా వడ్డీ కూడా లభిస్తుంది.  36 నెలల పాటు $360 (రూ. 29,361) చెల్లించవచ్చు. ఇలా EMI రూపంలో తీసుకుంటేనే భారీ డిస్కౌంట్‌తో ఫోన్‌ కొనుగోలు చేయోచ్చు.


గమనిక: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మీరు ప్రతి నెలా బిల్లు క్రెడిట్ రూపంలో డిస్కౌంట్ పొందుతారు. ఐఫోన్ 14 ప్లస్‌తో ఉత్పత్తి రెడ్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, పర్పుల్, బ్లూతో సహా అన్ని రంగులు అందుబాటులో ఉన్నాయి.


Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి


Also Read: Prince OTT: 'ప్రిన్స్‌' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి