COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Iqoo 12 5G Price: iQOO భారతీయ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఇటీవల లాంచ్‌ చేసిన iQOO 12 5G మొదటి సేల్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మొదటి సేల్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.11,249  కంటే తక్కువ ధరకే పొందే అవకాశాన్ని అందిస్తోంది. iQOO 12 5G మొబైల్ Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 1.5K రిజల్యూషన్‌తో వెట్ టచ్ టెక్నాలజీతో 144Hz ATPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఈ iQOO 12 5G స్మార్ట్ ఫోన్‌ ధర, డిస్కౌంట్‌ ఆఫర్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ధర వివరాలు:
భారతదేశంలో iQOO 12 5G స్మార్ట్‌ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్‌ ధర 12GB + 256GB వేరియంట్‌కు రూ. 52,999 కాగా, రెండవ వేరియంట్ 16GB + 512GB ధర రూ.57,999తో అందుబాటులో ఉన్నట్లు తెలస్తోంది. అలాగే ఫోన్ లెజెండ్,  ఆల్ఫా  కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఈ iQOO 12 5G మొబైల్‌ డిసెంబర్ 14, మధ్యాహ్నం 12:00 గంటల నుంచి Amazonతో పాటు iQOO స్టోర్‌లలో లభిస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. 


లాంచ్ ఆఫర్స్‌:
ఈ iQOO 12 5G స్మార్ట్‌ ఫోన్‌పై అమెజాన్‌ లాంచింగ్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా HDFC, ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి అదనంగా రూ.3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా iQOO, VIVO బ్రాండ్‌ సంబంధించిన పాత స్మార్ట్‌ ఫోన్స్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


అలాగే ఇతర బ్రాండ్‌లకు సంబంధించిన పాత స్మార్ట్‌ ఫోన్స్‌ను వినియోగించి కూడా రూ.41,750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ iQOO 12 5G స్మార్ట్‌ ఫోన్‌ రూ.11,249కే పొందవచ్చు. ఇక ఇదే స్మార్ట్ ఫోన్‌ను iQOO కంపెనీ సొంత ప్లాట్‌ఫారమ్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 1,000 ఇ-స్టోర్ వోచర్‌ను కూడా లభించనుంది. దీంతో పాటు బ్రాండ్ iQOO 12 మొబైల్‌పై 6 నెలల వరకు వారంటీని పొడిగించి కూడా అందిస్తున్నట్లు సమాచారం.


iQOO 12 5G ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే
2800×1260 పిక్సెల్స్‌ రిజల్యూషన్ 
3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌
Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌
FuntouchOS 14 ఆధారంగా Android 14
50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా
64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
టైప్-సి పోర్ట్‌
120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000 mAh బ్యాటరీ సెటప్‌
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి