Iqoo Neo 8: అదిరిపోయే ఫీచర్స్‌తో iQoo కొత్త మొబైల్స్..స్పెసిఫికేషన్స్, ధర వివరాలు ఇవే..
Iqoo Neo 8 And Iqoo Neo 8 Pro: ప్రముఖ చైనీస్ కంపెనీ iQoo మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయబోతోంది. ఇవి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo Neo 8 And Iqoo Neo 8 Pro: మార్కెట్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్‌లో డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టేక్ కంపెనీలు ప్రతి సంవత్సరం 4 నుంచి 5 స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా చైనీస్ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి. చైనీస్ టెక్ దిగ్గజం రెడ్మి సబ్ బ్రాండ్ iQoo మార్కెట్‌లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ప్రీమియం ఫీచర్స్‌తో మరో స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ Neo8 పేరుతో మార్కెట్లోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఫిబ్రవరిలో విడుదల కాబోయే iQoo సిరీస్ స్మార్ట్ ఫోన్స్ Neo8, Neo8 ప్రో మోడల్స్‌లో లభించనున్నాయి. ఈ iQoo స్మార్ట్‌ఫోన్ రెండు RAM వేరియంట్‌లలో (12GB, 16GB), రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో (256GB, 512GB) రాబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లను కంపెనీ చైనాలో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని భారత మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.
iQoo Neo 8 బేస్ వేరియంట్ ధర 2499 యువాన్ (సుమారు రూ. 29,300) నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రో మోడల్ విషయానికొస్తే..ధర 3299 యువాన్ (సుమారు రూ. 38,700) ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఇవే మొబైల్స్ భారత్లో విడుదల అయితే రేట్లలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు టెక్ టిప్ స్టర్స్ తెలుపుతున్నారు.
iQoo Neo 8 సిరీస్ స్పెసిఫికేషన్‌లు:
6.78 అంగుళాల డిస్‌ప్లే
1.5K రిజల్యూషన్
144Hz రిఫ్రెష్ రేట్
డ్యూయల్ ప్రెజర్ సెన్సిటివిటీ
Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్
V1+ చిప్‌సెట్
UFS 4.0 స్టోరేజ్‌తో బ్యాకప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter