Iqoo Neo 9 Pro: గేమింగ్ Iqoo Neo 9 Pro మొబైల్ వచ్చేస్తోంది..అన్ని స్మార్ట్ ఫోన్స్ తప్పుకోవాల్సిందే!
Iqoo Neo 9 Pro: అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి ప్రముఖ చైనీస్ బ్రాండ్ ఐక్యూ నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Iqoo Neo 9 Pro: ఐక్యూ నుంచి మార్కెట్‌లో నియో సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికీ ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌ను కంపెనీ iQoo Neo 9 ప్రో మోడల్‌తో మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. దీనిని కంపెనీ ఫిబ్రవరి 22 తేదిన విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. లాంచ్ అయిన తర్వాత కంపెనీ అమెజాన్‌లోకి అందుబాటులో తీసుకు రాబోతున్నట్లు కంపెనీ యోచిస్తోంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను iQoo Neo 7 Proకు సక్సెసర్‌గా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఐక్యూ కంపెనీ ఈ iQoo Neo 9 ప్రో స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే ప్రీమియం బడ్జెట్‌లో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించక ముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చాలా మందిలో ఈ మొబైల్‌పై మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే కంపెనీ మెయిన్‌గా యువతను బేస్ చేసుకుని ఈ మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది..
iQOO Neo 9 Pro ఫీచర్లు, స్పెషిఫికేషన్స్:
ఈ iQOO Neo 9 Pro స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది శక్తివంతమై ప్రాసెసర్‌తో రావడం వల్ల గేమర్స్‌కి మంచి గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు సహాయపడుతుందని పలువురు టెక్ టిప్‌స్టర్స్ తెలిపారు. కంపెనీ ఈ మొబైల్‌లో శక్తివంతమైన సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1తో సమానమైన చిప్‌ను అందించబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా iQOO నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ పవర్-ప్యాక్డ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ మార్కెట్‌లోకి విడుదలతే గేమ్-ఛేంజర్‌గా మారుతుందని టెక్ నిపుణులు తెలిపారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఇక ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..iQoo Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో కూడిన 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీని బ్యాక్ సెట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ వీడియో కాలీంగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తోంది. ఈ iQoo Neo 9 Pro స్మార్ట్ ఫోన్ డ్యూయల్-టోన్ డిజైన్, లెదర్ ఫినిష్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter