Iqoo Neo 9 Pro Price: 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్‌లోకి Neo 9, Neo 9 Pro మొబైల్స్..ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు..
Iqoo Neo 9 Pro Price: ఐక్యూ నుంచి తర్వలోనే మార్కెట్‌లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్స్ విడుదల కాబోతున్నాయి. కంపెనీ Neo 9, Neo 9 Pro పేర్లతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo Neo 9 Pro Price: ఐక్యూ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. iQOO 12ను కంపెనీ డిసెంబర్ 12న భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్ ఆర్డర్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇంతలోనే ఐక్యూ బ్రాండ్‌కి సంబంధించిన Neo 9, Neo 9 Pro స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఈ సిరీస్‌లకి సంబంధించిన లాంచింగ్ తేదిలను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్ ఫోన్స్ 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన లీకైన ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు
ఈ Neo 9, Neo 9 Pro స్మార్ట్ ఫోన్స్ 2800x1260 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ను ఇస్తాయి. ఇందులో కంపెనీ 2160Hz PWM డిమ్మింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు మీరు ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా పొందుతారు. నియో 9 ప్రో LPDDR5x RAM, UFS 4.0 స్టోరేజ్‌తో రాబోతోందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ డైమెన్షన్ 9300 చిప్‌సెట్, ప్రాసెసర్‌పై పని చేస్తాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంటుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఇక ఈ Neo 9, Neo 9 Pro స్మార్ట్ ఫోన్స్ విషయానికొస్తే..ఈ రెండు మొబైల్స్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ సోనీ IMX920 సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రాబోతోంది. ఈ మొబైల్ ఫోన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో 50 మెగాపిక్సెల్ Samsung JN1 అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఫ్రంట్ కెమెరాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గ్లాస్, లెదర్ బ్యాక్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. మొదట ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ చైనాలో విడుదల చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి