iQoo Neo 9 Pro Launch: త్వరలో లాంచ్ కానున్న iQoo Neo9 Pro స్మార్ట్‌ఫోన్, ధర, ఫీచర్లు ఇలా
iQoo Neo 9 Pro Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రోజురోజుకూ కొత్త కొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఇటీవల ప్రవేశించిన ఐకూ మార్కెట్‌పై పట్టు సాధిస్తోంది. ఇప్పుడు అద్బుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
iQoo Neo 9 Pro Launch: ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం రేపుతున్న బ్రాండ్ iQoo.ఈ బ్రాండ్ అద్భుతమైన ఫీచర్లు, స్మార్ట్ డిజైన్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పుుడు iQoo Neo 9 Pro పేరుతో కొత్త మోడల్ ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర ఇలా ఉన్నాయి.
iQoo Neo 9 Pro సరికొత్త స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. అమెజాన్ ఈ కామర్స్ వేదికపై కొనుగోలు చేయవచ్చు. త్వరలో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్‌ఫోన్ కోసం 1000 రూపాయలతో బుకింగ్ సౌకర్యం ఉంది. ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 37,999 రూపాయలుగా ఉంది. బ్యాంక్ ఆఫర్ల ఉపయోగించుకునే నేరుగా 3 వేల రూపాయలు తగ్గుతుంది. అంటే కేవలం 34,999 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్ దక్కించుకోవచ్చు.
మరోవైపు ఇదే ఫోన్‌లో ఏకంగా 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ కూడా అందుబాటులో ఉంది. అయితే అధికారికంగా ధర వెల్లడి కాలేదు కానీ 40 వేల రూపాయలు ఉండవచ్చని అంచనా. iQoo Neo 9 Pro ఫోన్ గ్లోసీ ఫినిష్, కాంక్వైరల్ బ్లాక్, డ్యూయల్ టోన్ ఫాక్స్ లెదర్ ఫైరీ రెడ్ ప్యానెల్ కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 6.7 అంగుళాల ఎల్పీటీవో ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ 2 ఎస్‌ఓసి చిప్‌తో సూపర్ కంప్యూటింగ్ క్యూ1 చిప్ అనుసంధానమై ఉంటుంది.
ఇక కెమేరా కూడా అద్భుతమైందనే చెప్పాలి. డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమేరా ఉంటాయి. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5160 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
Also read: AP Election Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అదికారం ఆ పార్టీదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook