ఇటీవల ఈ కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక సేల్స్‌లో హల్‌చల్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అందరికీ చేరువవుతోంది. ప్రత్యేక ఫీచర్లలో ప్రముఖ బ్రాండెడ్ ఫోన్లకు పోటీ ఇస్తోంది. ఆ స్మార్ట్‌ఫోన్ ఏది, ఫీచర్లు, ధర ఎలా ఉందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ కావాలంటే శాంసంగ్, వన్‌ప్లస్, షియోమి, రెడ్‌మి, వివో, ఒప్పో వంటి బ్రాండెడ్ ఫోన్లతో పాటు కొత్తగా ప్రవేశించిన ఐక్యూ కూడా ఉంది. ఇందులో ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర కావాలంటే మాత్రం ఐక్యూ మంచి ఆప్షన్. ఇందులో ఫీచర్లు అద్భుతంగా ఉండటమే కాకుండా వన్‌ప్లస్ వంటి ఫోన్లకు పోటీ ఇస్తోంది. 


ఇది  iQOO Z6 5G స్మార్ట్‌ఫోన్. అమెజాన్‌లో కేవలం 14,999 రూపాయలకు లభిస్తోంది. ఈ రేంజ్‌లో ఇదే అతి తక్కువ ధర. ఎందుకంటే అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ కలిగిన ఫోన్ ఇది. 


iQOO Z6 5G ఫీచర్లు


iQOO Z6 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 695 5జి ప్రోసెసర్ ఉంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 6.58  ఇంచెస్ సైజ్‌తో ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తుంది. మెయిన్ కెమేరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ కూడా 5000 ఎంఏహెచ్ సామర్ద్యం కలిగి ఉంది. ఓటీజీతో రివర్స్ ఛార్జింగ్ మరో ప్రత్యేకత. దీంతో మీ డివైస్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 5 లేయర్ల కూలింగ్ సిస్టమ్ ఉంది. 


Also read: HDFC Bank updates: మరోసారి వడ్డీ రేటు పెంచిన హెచ్‌డిఎఫ్‌సి, కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook