HDFC Bank updates: మరోసారి వడ్డీ రేటు పెంచిన హెచ్‌డిఎఫ్‌సి, కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే

HDFC Bank updates: ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సి కస్టమర్లకు దీపావళి కానుక అందించింది. ఇవాళ్టి నుంచి బ్యాంకు చేసిన మార్పులతో కోట్లాదిమంది కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 26, 2022, 06:30 PM IST
HDFC Bank updates: మరోసారి వడ్డీ రేటు పెంచిన హెచ్‌డిఎఫ్‌సి, కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే

ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతున్న హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు మరోసారి శుభవార్త విన్పించింది. బ్యాంకు చేసిన కీలకమార్పులు ఇవాళ్టి నుంచి అంటే అక్టోబర్ 26 నుంచి అమల్లో రానున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సి మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రెట్టింపు ప్రయోజనం చేకూరనుంది. ఇదే నెలలో ఓసారి వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకు..ఇప్పుడు మరోసారి ఆ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 26 నుంచి అమల్లో రానున్నాయి. ఈ కొత్త వడ్డీ రేట్లు 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలకు వర్తిస్తుంది. ఈసారి బ్యాంకు 50 బేసిస్ పాయింట్లు పెంచింది. సాధారణ కస్టమర్లకు 7 రోజుల్నించి 10 ఏళ్ల మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 3-6.25 శాతం వరకూ లాభం కలుగుతుంది. 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎఫ్‌డి వడ్డీ రేట్లు ఇలా

7 నుంచి 14 రోజులు                   3 శాతం
15 నుంచి 29 రోజులు                 3 శాతం
30 నుంచి 45 రోజులు                 3.50 శాతం
46 నుంచి 60 రోజులు                 4 శాతం
61 నుంచి 89 రోజులు                 4.50 శాతం
90 రోజుల్నించి 6 నెలలు           4.50 శాతం
6 నెలల్నించి 9 నెలలు             5.25 శాతం
9 నెలల్నించి 1 సంవత్సరం     5.50 శాతం
12 నుంచి 15 నెలలు                 6.10 శాతం
15 నుంచి 21 నెలలు                 6.15 శాతం
21 నెలల్నించి 2 ఏళ్లు               6.15 శాతం
2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ        6.25 శాతం

సీనియర్ సిటిజన్లకు మరో 50 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7 రోజుల్నించి 10 ఏళ్ల వడ్డీపై 3.5 శాతం నుంచి 6.95 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది.

Also read: Multibagger stocks: నాడు లక్ష రూపాయల పెట్టుబడి..ఇప్పుడు 3 కోట్ల రూపాయలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News