Vikram Lander Hop Experiment: చంద్రయాన్ 3 ప్రయోగంలో ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ఇంజన్స్ ఆన్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు... విక్రమ్ ల్యాండర్‌ని 40 సెంటీ మీటర్ల ఎత్తు మేరలో గాల్లోకి లేపి మళ్లీ అదే స్థలానికి 30 నుండి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇస్త్రో పంపించిన కమాండ్స్ ని విక్రమ్ ల్యాండర్ అమలు చేసి చూపించింది. ఇస్రో నుండి అందిన సంకేతాల మేరకు తన ఇంజన్ ఇగ్నిషన్ ఆన్ చేసుకుని గాల్లోకి లేచి మళ్లీ సురక్షితంగా కిందకు దిగడంలో విక్రమ్ ల్యాండర్ ఇస్రో ఆదేశాలను దిగ్విజయంగా పూర్తిచేసింది. ఈ ఘట్టంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ఇస్రో.. అందుకు సంబంధించిన వీడియోను X ( గతంలో ట్విటర్ ) ద్వారా అందరితో షేర్ చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవిష్యత్తులో చంద్రుడిపై నుండి భూమికి తిరిగొచ్చే మూన్ రిటర్న్ మిషన్స్‌కి, మానవసహిత ప్రయోగాలకు ఈ ప్రయోగం ఎంతో బూస్టింగ్‌ని ఇచ్చింది. అంతేకాకుండా విక్రమ్ ల్యాండర్ అనేది కేవలం రోవర్లను కిందకు దించేందుకు మాత్రమే కాకుండా మళ్లీ గాల్లోకి లేచి అక్కడ అధ్యయనాలు చేసేందుకు సైతం పనికొచ్చే అవకాశాలు లేకపోలేదు అని ఇస్రో చేసిన ఈ చిరు ప్రయోగం నిరూపించింది. 


విక్రమ్ ల్యాండర్ ఇప్పటికే తనకు అప్పగించిన లక్ష్యాలను అధిగమించింది. అంతేకాకుండా తాజాగా హాప్ ప్రయోగాన్ని కూడా అంతే విజయవంతంగా పూర్తి చేసింది. ఆగస్ట్ 23న చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్, చంద్రుడిపై పర్యావరణాన్ని అధ్యయనం చేసే లక్ష్యంతో తయారు చేసిన నాలుగు పేలోడ్స్ తమ పని తాము చేసుకుపోతున్నాయి. వీటిలో RAMBHA అనే పేలోడ్ సమీప-ఉపరితల ప్లాస్మా సాంద్రతను అధ్యయనం చేస్తుండగా.. ChaSTE అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను అంచనా వేస్తుంది. ఇక ILSA మరో పేలోడ్ విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ప్రదేశం చుట్టూ ఏవైనా ప్రకంపనలు ఉన్నాయా అనే కోణంలో అధ్యయనం చేస్తుంది. అలాగే, LRA అనే పేలోడ్ చంద్రుడి డైనమిక్స్ పరిశీలిస్తుంది. 


ఇది కూడా చదవండి : Aditya-L1 Mission Rehearsals: ఆదిత్య L1 ప్రయోగం రాకెట్ చెకింగ్, రిహార్సల్స్ పూర్తి


మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. విక్రమ్ ల్యాండర్ గాల్లోకి లేచే క్రమంలో పదిలంగా జాగ్రత్తపడుతూ ముడుచుకున్న ఈ నాలుగు పేలోడ్స్ కూడా ల్యాండర్ సురక్షితంగా కిందకు దిగిన తరువాత మళ్లీ యధాస్థానంలోకి వచ్చి తమ ఆపరేషన్ మొదలుపెట్టాయి. చంద్రయాన్-3 మిషన్ కార్యకలాపాల్లో నిమగ్నమైన విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడిపై ల్యాండ్ అవడం అనేక ఆసక్తికరమైన చర్చలకు తావిచ్చింది.


ఇది కూడా చదవండి : Shiv Shakti Site on Moon: చంద్రుడిపై ఆ స్థలానికి శివ శక్తి అనే పేరెలా వచ్చిందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి