Chandrayaan 3 Updates: జాబిల్లిపై నిశీధి, స్లీప్ మోడ్‌లో ప్రజ్ఞాన్ రోవర్, సెప్టెంబర్ 22న నిద్ర లేస్తుందా

Chandrayaan 3 Updates: జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపిన చంద్రయాన్ 3కు ఇప్పుడు విశ్రాంతి లభించింది. చంద్రునిపై రాత్రి ప్రారంభం కావడంతో ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లు నిద్రావస్థలో వెళ్లిపోయాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 3, 2023, 09:17 AM IST
Chandrayaan 3 Updates: జాబిల్లిపై నిశీధి, స్లీప్ మోడ్‌లో ప్రజ్ఞాన్ రోవర్, సెప్టెంబర్ 22న నిద్ర లేస్తుందా

Chandrayaan 3 Updates: చంద్రయాన్ 3 జీవితకాలం ముగిసింది. చంద్రునిపై నిశీధి ప్రారంభం కావడంతో ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లు నిలిచిపోయాయి.13 రోజులపాటు విజయవంతంగా పనితీరు కనబర్చి ఇప్పుుడ స్లీప్ మోడ్‌కు వెళ్లాయి. తిరిగి సెప్టెంబర్ 22న యాక్టివ్ కావచ్చని అంచనా.

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు సోలార్ ఆధారంగా పనిచేస్తాయి. చంద్రునిపై మరో మూడ్రోజుల్లో రాత్రి మొదలు కానుంది. చంద్రునిపై రాత్రి అంటే భూమిపై 14 రోజులతో సమానం. అంటే భూమిపై 24 గంటలంటే చంద్రునిపై 28 రోజులతో సమానం. ఇప్పుుడు రాత్రి ప్రారంభం కానుండటంతో 14 రోజుల వరకూ సూర్యరశ్మి ఉండదు సరికదా..ఉష్ణోగ్రత రాత్రి సమయంలో మైనస్ 200 డిగ్రీలకు పడిపోతుంది. అంందుకే ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లు పనిచేయవు. అందుకే ఈ రెండింటినీ స్లీపింగ్ మోడ్‌కు ఇనీషియేట్ చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ముందు ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌కు పంపించగా..త్వరలో విక్రమ్ ల్యాండర్‌ను కూడా నిద్రావస్థలోకి మళ్లించనున్నారు. 

సెప్టెంబర్ 22వ తేదీన చంద్రునిపై తిరిగి సూర్యోదయం అవుతుంది. అంటే అప్పటి వరకూ స్లీప్ మోడ్‌లో ఉండి అప్పుడు తిరిగి పనిచేయడం ప్రారంభించవచ్చని అంచనా. విక్రమ్ ల్యాండర్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పడి వరకూ జాబిల్లి దక్షిణ ధృవంపై 100 మీటర్ల వరకూ తిరిగింది. పూర్తి స్థాయిలో పనితీరు కనబర్చి..ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించింది.

చంద్రయాన్ 3తో వెలుగు చూసిన అంశాలు

ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుండగా...ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టాయి ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లు. చంద్రుని ఉపరితలంపై పగటి సమయంలో ఉష్ణోగ్రత 20-30 డిగ్రీల సెల్సియస్ ఉంటుందనేది ఇప్పటి వరకూ ఉన్న అంచనా. అయితే ఆ అంచనాకు భిన్నంగా చంద్రుని ఉపరితలంపై పగటి పూట 70 డిగ్రీల వరకూ ఉంటుందని తేలింది. చంద్రునిపై కూడా భూమిపై సంభవించినట్టే ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రునిపై సల్ఫర్, ఆక్సిజన్, అల్యూమినియం, సిలికాన్ వంటి మూలకాలున్నాయి. అయితే చంద్రునిపై నీటి జాడ కోసం సాగించిన అణ్వేషణ ఇంకా కొలిక్కి రాలేదు. దీని గురించి ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ఎలాంటి సమాచారం ఇంకా లభ్యం కాలేదు. 

Also read: Heavy Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News