Jio Bharat Phone: జియో భారత్ ఫోన్ వచ్చేసింది.. కేవలం 999 లకే
Jio Bharat Phone Features: జియో ఇండియన్ టెలికాం సెక్టార్ లో సరికొత్త విప్లవం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా మరో ప్రోడక్టుని ఆవిష్కరించింది. రిలయన్స్ జియో భారత్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తొలి దశలోనే దాదాపు 1 మిలియన్ యూనిట్ల లక్ష్యంతో అందుబాటులోకి రానున్న జియో భారత్ ఫోన్స్ జూలై 7, 2023 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Jio Bharat Phone Features: రిలయన్స్ జియో ఇండియాలో జియో భారత్ 4G పేరిట కొత్త ఫోన్స్‌ని లాంచ్ చేసింది. దేశంలో టెలికాం వినియోగదారులకు 2G స్పెక్ట్రాం నుంచి విముక్తి కల్పించే లక్ష్యంతో ఈ మొబైల్ ఫోన్‌ని లాంచ్ చేసింది. రెండు మోడల్స్‌లో ఈ జియో భారత్ ఫోన్స్ రానుండగా.. అందులో ఒక మోడల్ విడుదలైంది. లాంచ్ అయిన జియో భారత్ ఫోన్స్ తయారీ కోస మరో మొబైల్ ఫోన్స్ మేకింగ్ కంపెనీ అయిన కార్బన్ సంస్థతో రిలయన్స్ జియో చేతులు కలిపింది. జియో భారత్ ఫోన్‌లను తయారు చేయడం కోసం ప్రస్తుతం కార్బన్‌తో టయ్యప్ అవగా.. రాబోయే రోజుల్లో ఇతర బ్రాండ్స్ సైతం 'జియో భారత్ ఫోన్స్' తయారీ కోసం ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అని రిలయన్స్ జియో స్పష్టంచేసింది.
ముందుగా చెప్పుకున్నట్టుగా జియో భారత్ ఫోన్స్ రెండు రకాల సెట్స్‌గా కస్టమర్స్ ముందుకు రానుండగా.. అందులో మొదట లాంచ్ అవుతున్న రకం ఫోన్స్ దాదాపు 1 మిలియన్ యూనిట్లను కలిగి ఉందని.. ఈ నెల 7 నుంచి ఈ జియో భారత్ ఫోన్స్ అమ్మకాలకు అందుబాటులోకి రానున్నాయి అని రిలయన్స్ జియో ప్రకటించింది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్స్‌లో రిలయన్స్ జియో భారత్ ఫోన్ అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి : Harley-Davidson x440 Price, Features: హార్లే డేవిడ్‌సన్ నుంచి ఇండియాలో లాంచ్ అయిన మరో కొత్త బైక్
కొత్తగా లాంచ్ అయిన జియో భారత్ ఫోన్ ఇతర ఫీచర్ ఫోన్స్ తరహాలో కీప్యాడ్, స్క్రీన్ దిగువన భారత్ బ్రాండింగ్ లోగోతో కనిపిస్తోంది. వెనుక ప్యానెల్, స్పీకర్లలో కెమెరా కూడా ఉంది. జియో భారత్ ఫోన్ భారత్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవడానికి, ఫోటోలను క్లిక్ చేయడానికి, యూపీఐ చెల్లింపులను చేయడానికి అవకాశం ఉంది. జియో సినిమా, జియో సావన్, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : SUVs With 300km - 630km Range: 300 కిమీ - 630 కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK