Jio vs Airtel Fiber Plans: జియో, ఎయిర్‌టెల్ ఫైబర్ ప్రీ పెయిడ్ ప్రాన్స్ ధర, డేటా, ఓటీటీ లాభాల వివరాలు మీ కోసం
Jio vs Airtel Fiber Plans: రిలయన్స్ జియో ఇప్పటికే ఎయిర్ ఫైబర్ సేవలు ఎప్పుడు ప్రారంభయ్యేది ప్రకటించింది. ఎయిర్ ఫైబర్ అనేది 5జి డేటా అందించే వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మధ్య ప్లాన్స్ తేడాల గురించి తెలుసుకుందాం..
Jio vs Airtel Fiber Plans: దేశంలోని టెలీకం రంగంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మద్య పోటీ ఎక్కువగా ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ఇప్పటికే లాంచ్ చేయగా, రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ సెప్టెంబర్ 18న వినాయక చవితి నాడు లాంచ్ కానుంది. ఈ రెండు కంపెనీల మధ్య ప్లాన్స్, ఆఫర్లు, ఓటీటీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..
జియో, ఎయిర్‌టెల్ రెండూ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్‌లో 30 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకూ స్పీడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఉచిత ఓటీటీ సేవలు అందుతాయి. ఈ క్రమంలో మరోసారి ఈ రెండు కంపెనీలు ఆఫర్ చేస్తున్న ప్లాన్స్, ప్రయోజనాలు, ఓటీటీ సేవలు గురించి పరిశీలిద్దాం.
జియో ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్స్
జియో 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ స్పీడ్, అన్‌లిమిటెడ్ డేటా, 30 రోజుల వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇందులోనే 699 రూపాయల ప్లాన్ అయితే 100 ఎంబీపీఎస్ స్పీడ్, అన్‌లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ వెసులుబాటు ఉంటుంది. ఇక 999 రూపాయల ప్లాన్‌లో రోజుకు 150 ఎంబీపీఎస్ స్పీడ్, అన్‌లిమిటెడ్ డేటాతోపాటు జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా, జియో సెక్యూరిటీ యాక్సెస్ లభిస్తాయి.
ఇందులోనే 1499 రూపాయల ప్లాన్ అయితే 300 ఎంబీపీఎస్ స్పీడ్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, జియో సావన్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి 18 ఓటీటీ సేవలు లభిస్తాయి. ఇక 2499 రూపాయల ప్లాన్‌లో రోజుకు 500 ఎంబీపీఎస్ స్పీడ్, అపరిమితమైన డేటా, ఉచిత వాయిస్ కాలింగ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇంకా 16 ఓటీటీ సేవలు ఉచితంగా పొందవచ్చు. చివరిగా 3999 రూపాయల ప్లాన్‌లో 1 జీబీపీఎస్ స్పీడ్, 35 వేల జీబీ డేటా లబిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి 19 ఓటీటీలు ఉచితంగా అందుతాయి.
ఎయిర్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్స్
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ పైబర్ 499 రూపాయల ప్లాన్‌లో 40 ఎంబీపీఎస్ స్పీడ్ అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్ ఉంటాయి. దాంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం ప్యాక్, వింక్ మ్యూజిక్, అపోలో సేవలు లభిస్తాయి. ఇందులో 799 రూపాయల ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్, అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్ ఉంటాయి. వీటితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం ప్యాక్, వింక్ మ్యూజిక్, అపోలో సేవలు అందుతాయి.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ 999 రూపాయల ప్లాన్‌లో రోజుకు 200 ఎంబీపీఎస్ ప్లాన్‌తో పాటు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇతర ఓటీటీలు ఉచితంగా పొందవచ్చు. ఇక 1498 రూపాయల ప్లాన్‌లో రోజుకు 300 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా పొందవచ్చు. ఇక చివరిగా 3999 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1 జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సేవలు అందుతాయి.
Also read: iPhone 15 Series Launch: ఆపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, ఐఫోన్ 15 వచ్చేసింది, ధర, ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook