5G Network: 5జి లేదా 4జి..రెండింట్లో ఏది బెటర్, ఎందుకు, 5జితో కలిగే ఇతర ప్రయోజనాలేంటి
5G Network: దేశంలో ఇంకా 5జి నెట్‌వర్క్ పూర్తిగా ప్రారంభం కాలేదు. మరోవైపు 4 జి నెట్‌వర్క్ ఇంకా కొనసాగుతోంది. అసలు ఈ 5జి, 4జీ గోలేంటి, అసలు రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో తొలిదశలో కొన్ని నగరాల్లో ఇటీవల 5జి నెట్‌వర్క్ లాంచ్ అయింది. దేశం మొత్తం 5జి లాంచ్ అయ్యేందుకు ఇంకా ఏడాదిపైనే పట్టవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో 5జి వర్సెస్ 4జి పోల్చుకుంటే ఏది బెస్ట్ అనేది ఆసక్తి రేపుతోంది. ఆ వివరాలు మీ కోసం..
5జి అనేది నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జితో పోలిస్తే చాలా వేగవంతమైంది. కేవలం స్పీడ్ ఒక్కటే కాదు 5జి గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవల్సిన అవసరముంది. అత్యంత వేగం, క్లౌడ్ కంప్యూటింగ్, హెచ్‌డి వీడియో వంటి కీలకమైన అంశాలు 5జితో మరింత సులభమౌతాయి. 5 జీ నెట్‌వర్క్ వల్ల స్పీడ్ ఒక్కటే కాకుండా ఇంకా ఇతర చాలా ప్రయోజనాలున్నాయి.
1. 5జి స్పీడ్ విషయంలో 4జితో పోలిస్తే 10 రెట్లు వేగవంతమైంది. 5జి అనేది మీకు హెచ్‌డి వీఆర్ ప్రొజెక్షన్, హై క్వాలిటీ క్లౌడ్ గేమింగ్, హెచ్‌డి వీడియో కాల్ వంటి సౌకర్యాలు కల్పిస్తుంది.
2. క్లౌడ్ కంప్యూటింగ్ విషయంలో 5జి ఒక బెస్ట్ ఆప్షన్. 5జి స్పీడ్ క్లౌడ్ ప్రోసెసింగ్ సామర్ధ్యంతోపాటు ఎక్కువసేపు అనుసంధానమయ్యేట్టు చేస్తుంది. వేగవంతమైన క్లౌడ్ కంప్యూటింగ్ కారణంగా హై క్వాలిటీ సర్ఫింగ్ సాధ్యమౌతుంది. ఇది 4జీలో సాధ్యం కాదు.
3. హై డెఫినిషన్ క్వాలిటీ వీడియో అనేది 5జీతోనే సాధ్యం. మీ మొబైల్ ఫోన్ నుంచి హై క్వాలిటీ హెచ్‌డి వీడియో రికార్డ్ చేసి బదిలీ చేయడం 5జీతో సులభమైపోతుంది. 5జీ స్పీడ్‌తో 4కే, 8కే వీడియో సులభంగా చూడగలరు. ఇది 4జీతో అసాధ్యం.
4. క్లౌడ్ గేమింగ్ అనేది 5జితో చాలా సులభమౌతుంది. హై క్వాలిటీ క్లౌడ్ గేమింగ్ అనేది 4జితో సాధ్యం కాదు. క్లౌడ్ గేమింగ్ కోసం గేమింగ్ కన్సోల్ లేదా వేగవంతమైన కంప్యూటర్ అవసరమౌతుంది. 5జి మొబైల్‌తో క్లౌడ్ గేమింగ్ సులభమౌతుంది.
అంతేకాకుండా..వ్యవసాయం, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ మెడికేషన్, ఆన్‌లైన్ స్పోర్ట్స్ కనెక్టివిటీ రంగాల్లో 5జి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది.
Also read: Sula Vineyards: మార్కెట్‌లో మరో ఐపీవో, డిసెంబర్ 12న లాంచ్ కానున్న ఈ కంపెనీ షేర్ ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook