Sula Vineyards: మార్కెట్‌లో మరో ఐపీవో, డిసెంబర్ 12న లాంచ్ కానున్న ఈ కంపెనీ షేర్ ఎంతంటే

Sula Vineyards: షేర్ మార్కెట్ అనేది ఓ లోతైన ప్రపంచం. ఎప్పుడు ఏ షేర్ విలువ పెరుగుతుందో ఏది తగ్గుతుందో అంచనా వేయడం కష్టం. అదే సమయంలో కొత్త కంపెనీలు ఐపీవో లాంచ్ చేస్తుంటాయి. ఇప్పుడీ క్రమంలోనే మరో ఐపీవో లాంచ్‌కు సిద్ధంగా ఉంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 8, 2022, 03:56 PM IST
Sula Vineyards: మార్కెట్‌లో మరో ఐపీవో, డిసెంబర్ 12న లాంచ్ కానున్న ఈ కంపెనీ షేర్ ఎంతంటే

భారతదేశంలో అతిపెద్ద మద్యం కంపెనీ సులా వైన్‌యార్డ్స్. ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో అంటే డిసెంబర్ 12న ఐపీవో లాంచ్ చేస్తోంది. సులా వైన్‌యార్డ్స్ అనేది దేశంలో అతిపెద్ద మద్యం కంపెనీగా ఉంది. ఇప్పుడు ఐపీవో లాంచ్ చేస్తుండటంతో అందరి దృష్టీ నెలకొంది.

దేశంలో అతిపెద్ద మద్యం విక్రేత సులా వైన్ యార్డ్స్ డిసెంబర్ 12వ తేదీన పబ్లిక్ ఇష్యూ తీసుకొస్తోంది. డిసెంబర్ 14వ తేదీ వరకూ ఐపీవో అందుబాటులో ఉంటుంది. ఐపీవో లాంచ్‌కు ముందు యాంకర్ ఇన్వెస్టర్లకు డిసెంబర్ 9వ తేదీన సులా వైన్‌యార్డ్స్‌లో వేలం ఉంటుంది. సులా వైన్‌యార్డ్స్ మొత్తం 26,900,530 ఈక్వీటీ షేర్లకై ఉంటుందని అంచనా. ఈ ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్‌గా ఉంటుంది. 

మొత్తం ఐపీవో పరిమాణంలో 50 శాతం అర్హత కలిగిన సంస్థల కోసం వేలానికి కేటాయిస్తారు. ఇక 15 శాతం నాన్ ఆర్గనైజేషన్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. మిగిలిన 35 శాతం షేర్లను వ్యక్తిగత ఇన్వెస్టర్లకు కేటాయింపు ఉంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, సీఎల్ఎస్ఏ ఇండియా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌లు ఈ కంపెనీ ఐపీవోలకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. 

సులా వైన్‌యార్డ్స్ అనేది భారత లిక్కర్ పరిశ్రమలో మార్కెట్ లీడర్‌గా ఉంది. పదేళ్లకు పైగా ఈ రంగంలో అనుభవం సాధించింది. 100 శాతం గ్రేప్ వైన్ విభాగంలో కంపెనీ మార్కెట్ షేర్ 200లో 33 శాతం ఉండగా...2020లో 52 శాతం, 2021లో 52.6 శాతం ఉంది. వైన్‌లో 56 బ్రాండ్లు ఈ కంపెనీవే కావడం విశేషం. 2022 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 4,539.16 మిలియన్లుగా ఉంది. 2023 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 74.32 శాతం పెరిగింది. 

ఈ కంపెనీ షేర్ ధర, ఐపీవో పరిమాణంపై ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 10లోగా అన్ని వివరాలు బహిగ్దతం కానున్నాయి.

Also read: PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు షాక్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News