Get  Lava Storm 5G At Rs.749 On Amazon In First Sale​: ప్రముఖ భారతీయ టెక్‌ బ్రాండ్‌ లావా 5జీ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీంతో లావా కూడా  5G మార్కెట్‌లో కూడా చోటు సంపాదించుకుంది. ఈ మొబైల్‌ను కంపెనీ Lava Storm 5G పేరుతో లాంచ్‌ చేసింది. ఈ ఏడాది ముగిసే లోపే 5G మొబైల్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. దీని కోసం కంపెనీ డిసెంబర్ 28న ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలోనే విక్రయించబోతున్నట్లు అమెజాన్‌ తెలిపింది. ఈ మొబైల్‌ను కంపెనీ  రూ. 12,000 కంటే తక్కువ ధరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Lava Storm 5G స్మార్ట్ ఫోన్‌ శక్తివంతమైన MediTek ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 8GB ఇన్‌స్టాల్ చేసిన RAMతో పాటు, 8GB వర్చువల్ ర్యామ్‌ ఫీచర్‌తో లభిస్తోంది. అంతేకాకుండా  భారతీయ టెలికాం ఆపరేటర్లు ఉపయోగించే అన్ని 5G బ్యాండ్‌లను సపోర్ట్ చేసే విధంగా రూపొందిచిన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్‌లో కొన్ని యాప్స్‌ను ఫ్రీగా అందించిన్నట్లు కంపెనీ తెలిపింది.  


భారీ తగ్గింపుతో పొందండి:
ఈ రోజు అమెజాన్‌లో Lava Storm 5G స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌ మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రారంభమైంది. అమెజాన్‌లోనే కాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను లావా ఇ-స్టోర్ నుంచి కూడా నేరుగా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర MRP రూ.14,999 కాగా..అమెజాన్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా కేవలం రూ. 13,499కే అందిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


అమెజాన్‌లో Lava Storm 5G స్మార్ట్‌ ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. అమెజాన్‌ అనుసంధాన బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,500 అదనపు తగ్గింపుతో లభిస్తుంది. దీంతో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ కేవలం రూ.11,999కే కొనుగోలు చేయోచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.12,750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ Lava Storm 5G స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ.749కే పొందవచ్చు. 


Lava Storm 5G స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్:
6.78 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
MediaTek Dimensity D6080 ప్రాసెసర్‌
AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్‌
8GB ఇన్‌స్టాల్, 8GB వర్చువల్ ర్యామ్
50MP ప్రైమరీ బ్యాక్‌ కెమెరా 
8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ కెమెరా 
16MP సెల్ఫీ కెమెరా
5000mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter