Microsoft Layoffs: దిగ్గజ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ కంపెనీ మరోసారి భారీఎత్తున తొలగింపు చర్యలు చేపట్టిందట. గేమింగ్ విభాగంలో పనిచేస్తున్న 1900 మందిని తొలగించనుందట. దీనిప్రభావం 8%  ఎంప్లాయిస్ పై ఉంటుంది. ఇది మైక్రోసాప్ట్‌ యాక్టివిజన్ బ్లిజార్డ్, ఎక్స్ బాక్స్ లో పనిచేసేవారిపై వేటుపడనుంది. ఈ దిగ్గజ టెక్కీ గతేడాదే యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 68 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తొలగింపు చర్యలు చేపట్టనుందని బ్లూంబర్గ్ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో దిగ్గజ మైక్రోసాఫ్ట్ త్రీ ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన రెండో కంపెనీగా అవతరించింది. యాపిల్ తర్వాత, మైక్రోసాఫ్ట్ మొదటిసారి ఈ సంఖ్యను తాకింది.  దీంతో మైక్రోసాఫ్ట్ షేర్లు 1.31 శాతం పెరిగి 404 డాలర్లకు చేరాయి. 


మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ తన సిబ్బందికి ఈ లేఆఫ్స్ పై ఇమెయిల్ పంపాడట. ఈ కంపెనీలో పనిచేస్తున్న 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మందిని తొలగిస్తున్నట్లు ఉందని బ్లూంబర్గ్ ప్రకటించింది.


Also Read:  KTR Viral Tweet: సంచలనం రేపుతోన్న కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్.. రాష్ట్రరాజకీయాల్లో తీవ్రచర్చ..!


ఈ తొలగింపులు ఎక్కువ శాతం ఇటీవల కంపెనీ కొనుగోలు చేసిన వీడియోగేమ్ పబ్లిషర్ యాక్టివిజన్ బ్లిజార్డ్‌లో జరుగుతాయట.  కానీ, మైక్రోసాఫ్ట్ ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. గతంలో 2023 సంవత్సరంలో కూడా ఈ దిగ్గజ టెక్ కంపెనీ పెద్ద ఎత్తున తొలగింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగం అధిపతి నుండి వచ్చిన ఈ అంతర్గత మెమోను ఉటంకిస్తూ ది వెర్జ్ కూడా గురువారం కంపెనీల్లో తొలగింపులను నివేదించింది. 


Also Read: Mahalakshmi Scheme: మహిళల ఖాతాల్లో ఆరోజే రూ.2,500 జమా.. మహాలక్ష్మి పథకంపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook