Motorola G04 Price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ మోటరోలా నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ ధర పది వేలలోపు ఉండొచ్చని అంచనా. త్వరలో లాంఛ్ అవ్వబోయే ఫోన్ మోటో జీ04గా తెలుస్తోంది. ఇది ఇండియాలో ఫిబ్రవరి 15న విడుదల కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ యెుక్క ఫీచర్లు, ఆఫర్స్, ధర లీక్ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫీచర్స్, ధర ఇవే.
ఈ మోటో జీ04 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తోంది. ఇది 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్ మరియు 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ తో రాబోతున్నాయి. ఈ ఫోన్ డిజైన్‌ చాలా స్టైలిష్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మెుబైల్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది యూనిసెక్ టీ606 ప్రోసెసర్ తో రాబోతుంది. ఇందులో 16మెగా ఫిక్సల్ ఏఐ కెమెరాను కూడా తీసుకురాబోతున్నారు. ఫ్రంట్ 5-మెగా ఫిక్సల్ కెమెరా ఉంటుంది. ఇది కాంకర్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సీ గ్రీన్, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్స్ హ్యాండ్‌సెట్స్ తో రావచ్చు. 


Also Raad: Paytm Name Changed: పేరు మార్చుకున్న పేటీఎం, ఫిబ్రవరి 29 తరువాత Pai ఇ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్


పది వేల లోపే..


ఇది లేటెస్ట్ ఆండాయ్రిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో రాబోతుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 10వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ను అందిస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ మరియు డాల్బీ అట్మోస్‌ కూడా ఉంది. ఇది యూరప్ లో రూ. 10, 751 రూపాయలకు లాంఛ్ అయింది. మరి ఇండియాలో ఎంత రేటుకు తీసుకువస్తారనేది చూడాలి. అందుతున్న సమాచారం ప్రకారం, పది వేల లోపు ఉండొచ్చని అంచనా.


Also Read: Prithvi Shaw: రంజీల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన పృథ్వీ షా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook