Prithvi Shaw: రంజీల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు అతడి సొంతం..

Prithvi Shaw: భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను పృథ్వీ షా సొంతం చేసుకున్నాడు. దేశవాలీ క్రికెట్ లో తొలి రోజు లంచ్‌కు ముందే రెండు సార్లు శతకాలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 03:46 PM IST
Prithvi Shaw: రంజీల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు అతడి సొంతం..

Prithvi Shaw Creates history: టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీషా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించాడు. రంజీ ట్రోఫీలో లంచ్ లోపు రెండు సార్లు సెంచరీ చేసిన ఆటగాడిగా పృథ్వీషా  సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజే లంచ్‌కు ముందే సెంచరీ కొట్టి ఈ రేర్ ఫీట్ ను అందుకున్నాడు. గతంలో అసోంతో జరిగిన మ్యాచ్ లోనే ఇదే విధంగా లంచ్‌కు ముందే శతకం కొట్టాడు. ఆ మ్యాచ్ లో పృథ్వీ 379 బంతుల్లో  383 పరుగులు చేసి రంజీల్లో రెండో ఆత్యధిక స్కోరును నమోదు చేశాడు. 

పృథ్వీషా మళ్లీ నేషనల్ టీమ్ కు ఆడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడేందుకు వెళ్లి గాయపడి వచ్చిన షా.. పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్ లో అతడు  185 బంతుల్లోనే 159 పరుగులు చేశాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ రాబోతుంది. ఇందులో బాగా ఆడితే షా మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉంది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన షా దారుణంగా విఫలమయ్యాడు. రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ వేలంలో కీలక ఆటగాళ్లను వదులుకున్న ఢిల్లీ.. పృథ్వీ షాపై మాత్రం నమ్మకం ఉంచింది. త్వరలో మెుదలుకానున్న ఐపీఎల్ సీజన్ 17లో షా ఎలా రాణిస్తాడో చూడాలి. 

Also Read: India vs England Updates: సిరీస్ మెుత్తానికి కోహ్లీ, శ్రేయస్ దూరం.. జట్టులోకి కొత్త కుర్రాడు..

మరోవైపు టీమిండియా సీనియర్ ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారా రంజీల్లో చెలరేగుతున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో పూజారా సెంచరీతో సత్తా చాటాడు. అతడు 230 బంతుల్లో 110 పరుగులు చేశాడు. మరోవైపు హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా జాతీయ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. తాజాగా నాగాలాండ్ తో జరిగిన మ్యాచ్ లో శతకం కొట్టాడు. 

Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్‌ను వీడనున్న రోహిత్ శర్మ, కారణం అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News