Moto G62 5G Smartphone: అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ 'మోటరోలా' గత వారం ఇండియన్ మార్కెట్‌లోకి మోటో G62 5G మోడల్‌‌ను లాంచ్ చేసింది. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇవాళ్టి నుంచే ఈ స్మార్ట్ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. లాంచింగ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ దీనిపై భారీ తగ్గింపు అందిస్తోంది. 18 శాతం డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. తద్వారా చౌక ధరకే కస్టమర్స్ ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం డిస్కౌంట్ :


'మోటో G62 5G' స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ.21,999. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 18 శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోను ఇప్పుడీ స్మార్ట్ ఫోన్ రూ.17,999కే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్‌ కొనుగోలుకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు. తద్వారా మోటో జీ62 5జీ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా రూ.16,499కే సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ.624 చెల్లించడం ద్వారా ఈఎంఐ పద్దతిలోనూ ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.999కే


'మోటో G62 5G' స్మార్ట్ ఫోన్‌‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే దాని కండిషన్‌ని బట్టి గరిష్ఠంగా రూ.17 వేలు వరకు తగ్గింపు పొందుతారు. తద్వారా రూ.17,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.999కే పొందవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి కండిషన్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోండి.


మోటో G62 5G ఫీచర్స్ :


6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
6.55 అంగుళాల డిస్‌ప్లే
50 మెగా పిక్సెల్+8మెగా పిక్సెల్+2 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్
16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh లిథియం పాలిమర్ బ్యాటరీ 
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 


Also Read: China: చైనాలో సెగలు పుట్టిస్తోన్న హీట్ వేవ్..మేఘమథనం షూరు చేసిన ప్రభుత్వం..!


Also Read: నీ తెలివికి ఓ దండం సామి.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook