Motorola Amphisoundx 120W Price: మార్కెట్‌లో సౌండ్ బార్లకు మంచి డిమాండ్ ఉంది. థియేటర్ అనుభూతిని పొందడానికి స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసే క్రమంలోనే చాలామంది సౌండ్ బార్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో స్మార్ట్ టీవీ లతోపాటు సౌండ్ బార్లు కాంబో ఆఫర్స్‌తో లభిస్తున్నాయి. దీపావళి సేల్‌లో భాగంగా కొన్ని సౌండ్ బార్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా అన్ని బ్రాండ్లకు సంబంధించిన సౌండ్ బార్లను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ప్రముఖ టెక్ కంపెనీ మోటరోలా విడుదల చేసిన సౌండ్ బార్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ లభించింది. అతి తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు కలిగి ఉండడంతో కస్టమర్స్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. అయితే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ దీనిని దృష్టిలో పెట్టుకొని తమ కస్టమర్స్‌కి మరింత తగ్గింపు ధరతో అందించేందుకు ఈ సౌండ్ బార్ పై ప్రత్యేక డీల్‌ను ప్రారంభించింది. ఈ సౌండ్ బార్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో ప్రత్యేక డీల్‌లో ఎంత డిస్కౌంట్ లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్


ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA AmphisoundX సౌండ్ బార్ 2 వేరియంట్లలో లభిస్తుంది. మొదటి వేరియంట్ MRP ధర రూ.13,499 కాగా ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా 48 శాతం తగ్గింపుతో రూ.6,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ సౌండ్ బార్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు అదనపు తగ్గింపుతో పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకును వినియోగించి బిల్లు చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ సౌండ్ బార్‌ను ఫ్లిప్‌కార్ట్‌ పే లెటర్‌తో బిల్ పే చేస్తే నో కాస్ట్ EMI కూడా లభిస్తుంది.


సౌండ్ బార్ ఫీచర్స్:
ఈ సౌండ్ బార్ తో మోటరోలా కంపెనీ అనేక రకాల కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక ఈ సౌండ్ బార్ ఊపర్ ఎక్స్ట్రా బాస్‌తో పాటు పవర్ఫుల్ డీప్ బాస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు హై క్వాలిటీ ఆడియోను అవుట్ ఫుట్ అందించేందుకు అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇక కంపెనీ ఈ సౌండ్ బార్‌కు సిస్టం ఆపరేటింగ్ కోసం రిమోట్ కంట్రోల్ ని కూడా అందించింది.


Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి