Flipkart Offers: Motorola లాంచ్ చేసిన 2 మొబైల్స్‌పై భారీ తగ్గింపు..డిస్కౌంట్ వివరాలు ఇవే!
Motorola E13, Motorola G14: అతి తక్కవ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ శుభవార్త తెలిపింది. Motorola e13, Motorola G14 స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola E13, Motorola G14: తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? Motorola తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్ విడుదల చేసింది. ఈ మొబైల్ అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా Motorola e13, Motorola G14 స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి భారీ ప్లాట్ డిస్కౌంట్ లభించడమే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ రెండు మొబైల్స్‌పై లభిస్తున్న ఆఫర్స్ ఏంటో.. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
motorola e13:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. అయితే దీని అసలు ధర రూ.10,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.6,499కే పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్‌ను వినియోగిస్తే అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. దీని కోసం ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
ఇక ఫీచర్స్ విషయానికొస్తే ఈ మొబైల్ 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. బ్యాక్ సెట్‌లో 13 మెగాపిక్సెల్స్ కెమెరాతో పాటు ఫ్లాష్ లైట్ ఉంటుంది. దీంతో పాటు సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ Unisoc T606 ప్రాసెసర్‌పై పని చేస్తుంది.
Motorola G14:
ప్రస్తుతం Flipkartలో ఈ Motorola G14 స్మార్ట్ ఫోన్ 4 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఈ మొబైల్ ధర రూ.8,499 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసేవారు రూ. 299 చెల్లించి స్మార్ట్ ఫోన్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ మొబైల్ 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు Unisoc T616 ప్రాసెసర్‌పై పని చేస్తుంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter