Moto G54: Motorola కళ్లు తిరిగే ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌తో మోటో జి 54 లాంచ్ , ధర, ఫీచర్లు ఇలా
Moto G54: దేశంలో చాలా రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని బ్రాండెడ్ అయితే మరి కొన్ని అంతగా ప్రాచుర్యం లేనివి. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లలో అతి ముఖ్యమైంది మోటోరోలా కొత్తగా మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.
Moto G54: మోటోరోలా భారతదేశ మార్కెట్‌లో కొత్తగా మోటో జి54 పేరుతో 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. మోటో జి సిరీస్‌లో అద్భుతమైన డిస్‌ప్లే, డైనమిక్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన స్మార్ట్ క్రేజీ ఫోన్ ఇది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు, ధర ఏంటనేది తెలుసుకుందాం..
దేశంలో ఇటీవల లాంచ్ అయిన Moto G54 5G ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC కలిగి ఉంటుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అదనపు ఉండటం వల్ల ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే అత్యద్బుతంగా 6000 ఎంఏహెచ్ ఉంటుంది. మార్కెట్‌లో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యధికం.
Moto G54 5G ధర
Moto G54 5G 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 15,999 రూపాయలుంది. ఇక ఇందులోనే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 18,999 రూపాయలుంది. ఇందులో మిడ్ నైట్ బ్లూ, మింట్ గ్రీన్, పియర్ బ్లూ ఉన్నాయి. సెప్టెంబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ ద్వారా Moto G54 5G కొనుగోలు చేస్తే 1500 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు.
Moto G54 5G ఫీచర్లు
ఇది 6.5 ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాదు..120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఆక్టాకోర్ డైమెన్సిటీ 7020తో అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇక బ్యాటరీ అయితే మరే ఇతర స్మార్ట్‌ఫోన్‌లో లేనట్టుగా 6000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే కేవలం 66 నిమిషాల్లో 90 శాతం ఛార్జ్ అవుతుంది. ఇక కెమేరా విషయంలో అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో వస్తోంది. ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్టావైడ్ యాంగిల్ కెమేరా ఉంటుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమేరా 16 మెగాపిక్సెల్ ఉంది. Moto G54 స్మార్ట్‌ఫోన్ ఐపీ 52 రేటింగ్, వాటర్ ప్రొటెక్షన్, డ్యూయర్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఎట్మోస్ టెక్నాలజీ కలిగి ఉంది.
Also read: Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఇకపై లోయర్ బెర్త్‌లు ఆ ప్రయాణీకులకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook