Motorola Razr 40 Ultra Price & Release Date: మోటోరోలా కంపెనీ తన కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లు మోటోరోలా Razr 40, Ultra పేర్లతో జూన్ 1వ తేదీన వినియోదారులకు ముందుకు రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొబైల్స్ కంటే భిన్నంగా ఉండబోతున్నాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇంతకుముందు ఉన్న వాటికంటే చాలా రకాల అధునాతన ఫీచర్లు ఈ ఫోన్లో రాబోతున్నట్లు అధికారిక సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గీక్‌బెంచ్ అందించిన సమాచారం మేరకు.. Motorola Razr 40 సిరీస్ స్మార్ట్ ఫోన్లు మోడల్ నంబర్ XT2323-3తో జాబితా చేర్చారని పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ 40K Android 13లో రన్ కాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా 5జీ కనెక్టివిటీతో పాటు 33W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉండబోతోంది.


ఈ స్మార్ట్ ఫోన్ సింగిల్-కోర్ పరీక్షలో 1,019 పాయింట్లు  సాధించగా..మల్టీ-కోర్ పరీక్షలో 2,545 పాయింట్లను స్కోర్ చేసినట్లు సమాచారం. అన్ని మొబైల్స్ కంటే భిన్నంగా 2.40GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు పలువురు టెక్ నిపుణులు పేర్కొన్నారు.


Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..


Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్‌లు:
✺ 6.9 అంగుళాల డిస్‌ప్లే
✺ 2,640 x 1,080 పిక్సెల్‌  కలర్ ఫుల్ డిస్‌ప్లే
✺ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC 
✺ 256GB ఇంటర్నల్ స్టోరేజ్
✺ 32-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
✺ 13-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా
✺ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
✺ 3,800mAh బ్యాటరీ బ్యాటరీ ప్యాకప్


Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి