Akash Ambani: ప్రజలకు శుభవార్త.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆకాష్ అంబానీ
ఆకాష్ అంబానీ దేశ ప్రజలకు ఒక శుభవార్త అందించారు. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 22 లైసెన్స్ సర్వీస్ ఆసియా (ఎల్ఎస్ ఎ) లో 5జీ నెట్వర్క్ ను ప్రారంభించడానికి పూర్తి చేసినట్లు ప్రకటించారు. వివరాలు..
Mukesh Ambani: గత ఏడాది 5జీ సేవలు దేశవ్యాప్తంగా ప్రారంభం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీలకు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ ను భారతదేశంలో 5జి స్పెక్ట్రమ్ ను రూ. 88,078 కోట్లకు ద్రువీకరించారు. గతంలోనే మొదటి విడతగా దేశవ్యాప్తంగా 13 నగరాలలో ఈ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు.
కానీ పూర్తి స్థాయిలో ఆ సేవలు ప్రారంభం కాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఫైవ్ జి సర్వీసులు ప్రారంభించింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో కూడా ఈ ఏడాది వరకు జియో ఫైవ్ జీ సేవలు అందిస్తామని మాట ఇచ్చారు. దీంతో 5జి స్పెక్ట్రమ్ కోసం రెండో విడతగా రూ.7964 కోట్లను టెలికాం శాఖకు చెల్లించాల్సిన సమయం వచ్చేసింది. దీంతో అంతకంటే ముందే ఆకాష్ అంబానీ దేశ ప్రజలకు ఒక శుభవార్త అందించారు.
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 22 లైసెన్స్ సర్వీస్ ఆసియా (ఎల్ఎస్ ఎ) లో 5జీ నెట్వర్క్ ను ప్రారంభించడానికి పూర్తి చేసినట్లు ప్రకటించారు. మామూలుగా గత సంవత్సరం కొనుగోలు చేసిన స్పెక్ట్రం కోసం కంపెనీ అన్ని స్పెక్టర్ బ్యాండ్ లలో షెడ్యూల్ కంటే ముందే ఈ లాంచ్ ను పూర్తి చేసింది. ఈ సందర్భంగా జియో 700MHz, 800MHz, 1800MHz, 26GHz బ్యాండ్లల్లో స్పెక్ట్రంతో అతిపెద్ద స్పెక్ట్రమ్ పరిధిని కలిగి ఉంది.
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023 కు టీమ్ ఇండియా ప్లేయింగ్ 17 ఇదే, సూర్యకు స్థానం లేదా
ఇక దీంతో పాటు జియో కంపెనీకి చెందిన ఫై జి నెట్వర్క్ కూడా వేగంగా ఉంది. ఇక జియో ప్రస్తుతం తన ప్రతి 22 సర్కిల్లో మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (26 GHz) లో 1000MHz ను కలిగి ఉంది. అంటే ఇది ఎక్కువ నాణ్యత గల స్ట్రీమింగ్ ను అందిస్తుంది. అంతేకాకుండా జియో తన ప్రారంభానికి సంబంధించిన వివరాలన్నీ టెలికాం డిపార్ట్మెంట్ కు గత నెలలో సమర్పించింది. దీంతో ఆగస్టు 11 నాటికి అన్ని సర్కిల్లో టెస్టింగ్ పనులు కూడా పూర్తి చేసింది.
ఈ సందర్భంగా ఆకాష్ అంబానీ కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం, టెలికాం డిపార్ట్మెంట్, 1.4 బిలియన్ల భారతీయులకు తమ కంపెనీ నిబద్ధత ఏంటో అనేది నిరూపించే నాణ్యత 5జి సేవలను ప్రారంభించామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 5జీ సేవలకు సంబంధించి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకు వెళ్లినట్లు చెబుతున్నందుకు గర్విస్తున్నామని అన్నాడు. ఇక ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ ప్రారంభించేందుకు తమ బృందం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి