Nokia Latest 5G Phone 2023: క్విక్‌ఫిక్స్ సాంకేతికతతో మార్కెట్‌లోకి Nokia 5G మొబైల్స్‌..చీప్‌ ధరలకే ఫోన్స్‌..

Nokia Latest 5G Phone 2023: నోకియా కంపెనీ తమ కస్టమర్స్‌కి మరో గుడ్‌ న్యూస్‌ని తెలిపింది. ఎప్పటి నుంచో విడుదల చేస్తానని ప్రకటించిన Nokia G310 5G, Nokia C210 మోడల్స్‌ను ఇటీవలే యూఎస్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 17, 2023, 12:14 PM IST
Nokia Latest 5G Phone 2023: క్విక్‌ఫిక్స్ సాంకేతికతతో మార్కెట్‌లోకి Nokia 5G మొబైల్స్‌..చీప్‌ ధరలకే ఫోన్స్‌..

Nokia Latest 5G Phone 2023: నోకియా మొబైల్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే..ఈ ఫోన్స్‌కి గొప్ప చరిత్ర ఉంది. అయితే ఈ కంపెనీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్స్ విషయంలో మాత్రం వెనక అడుగు వేసిందని చెప్పచ్చు. గత 4 సంవత్సరాల నుంచి నోకియా ఇతర ఆండ్రాయిడ్  ఫోన్స్‌పై పోటీ పడలేకపోయింది. కానీ కస్టమర్లకు మాత్రం మన్నిక గల స్మార్ట్‌ ఫోన్స్‌ అందించింది. అయితే నోకియా కంపెనీ తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Nokia G310 5G, Nokia C210 మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ రెండు మోడల్స్‌ నూతన టెక్నాలజీతో పాటు చాలా రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ మొబైల్‌ ఫోన్స్‌ ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతాయి. Nokia G310 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు రెండు బ్యాక్‌ కెమెరా సెన్సార్స్‌ను కలిగి ఉంటుంది. ఇక Nokia C210 విషయానికొస్తే 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. Nokia G310 5G స్మార్ట్‌ ఫోన్‌  "క్విక్‌ఫిక్స్" సాంకేతికతతో వస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. నోకియా C210 విషయానికొస్తే 3000mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉందని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ ఫోన్‌లను ఇటీవలే కంపెనీ యుఎస్‌లో విడుదల చేసింది. ఈ మొబైల్‌ ఫోన్‌లలో కొత్త ఫీచర్లు ఉండడం వల్ల మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. 

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

ధరలు ఈ విధంగా ఉన్నాయి:
యుఎస్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ ధరల ప్రకారం..Nokia G310 5G మోడల్‌ ధర USD 186 ఉంది. ఇది భారత మార్కెట్‌లో దాదాపు రూ. 15,000 ఉంటుందని సమాచారం. ఇక Nokia C210 ధర విషయానికొస్తే..భారత్‌లో దాదాపు రూ. 9,000 ఉంటుందని అంచన. Nokia C210 ఫోన్ సెప్టెంబర్ 14 నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తాయని సమాచారం. అయితే ఇప్పటికీ భారత్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ విక్రయాల గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ త్వరలోనే చేయబోయే అవకాశాలు ఉన్నట్లు కొందరు టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News