Poco F6 Launch Date In India: మొబైల్‌ తయారీ కంపెనీ పోకో మరో గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. త్వరలోనే తమ POCO F6 మోడల్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని కంపెనీ గ్లోబల్ లాంచింగ్‌ చేయబోతున్నట్లు టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ అతి శక్తివంతమైన Qualcomm చిప్‌సెటప్‌పై మార్కెట్‌లో రాబోతోంది. అయితే లాంచింగ్‌కి ముందే ఈ మొబైల్‌కి సంబంధించి కొన్ని ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. లీక్‌ అయిన స్పెషిఫికేషన్స్‌ ఏంటో? ఈ స్మార్ట్‌ఫోన్‌పై టిప్‌స్టర్స్‌ అంచనలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ POCO F6 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అతి చౌక ధరలో విక్రయించేందుకు యోచిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన POCO F5 స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 SOC ప్రాసెసర్‌ను కలిగి ఉంటే..ఈ మొబైల్‌ మాత్రం  Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గేమింగ్ కోసం ఇందులో ఎన్నో రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి రాబోతున్నాయి. లీక్‌ అయిన వివరాల ప్రకారం..ఈ మొబైల్‌ SM8475 మోడల్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ POCO F6 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను ఏప్రిల్‌ రెండవ వారంలో లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. 


ఇటీవలే కొన్ని డేటాబేస్‌లలో POCO F6 స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ వెర్షన్ కోసం 24069PC21G మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. కంపెనీ ఈ మొబైల్‌ను జపాన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ Redmi Note 13 Turbo స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కి ముందే ఈ మొబైల్‌ను లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. అంతేకాకుండా కొంతమంది టిప్‌స్టర్స్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ నోట్ 13 టర్బో  రీబ్రాండెడ్ వెర్షన్‌గా తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.


పోకో ఎఫ్ 6 టాప్ ఫీచర్స్:
1. శక్తివంతమైన ప్రాసెసర్:

Qualcomm Snapdragon 8 Gen 2 SoC
అత్యుత్తమ గేమింగ్ , మల్టీటాస్కింగ్ కోసం..


2. అద్భుతమైన డిస్ప్లే:
6.67-అంగుళాల AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
HDR10+ సపోర్ట్


3. వేగవంతమైన చార్జింగ్:
120W హైపర్ చార్జ్ సపోర్ట్
0% నుంచి 100% వరకు కేవలం 27 నిమిషాల్లో చార్జ్ అవుతుంది.


4. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్:
50MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా


5. 4K వీడియో రికార్డింగ్:
60fps 4K వీడియో రికార్డింగ్
30fps 8K వీడియో రికార్డింగ్


6. సెల్ఫీల కెమెరా:
16MP సెల్ఫీ కెమెరా
AI బ్యూటిఫికేషన్ మోడ్


7. 5G కనెక్టివిటీ:
5G SA/NSA సపోర్ట్
వేగవంతమైన డేటా డౌన్‌లోడ్‌లు, అప్‌లోడ్‌లు


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


8. స్టీరియో స్పీకర్లు:
Dolby Atmos సపోర్ట్
అద్భుతమైన ఆడియో అనుభవం


9. భారీ బ్యాటరీ:
4700mAh బ్యాటరీ
రోజంతా ఉండే బ్యాటరీ లైఫ్


10. MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్:
Android 13 ఆధారిత
అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి