Truecaller New Update: ఐఫోన్ వినియోగదారులకు..కొత్త ట్రూకాలర్ అప్‌డేట్ లాంచ్, పదిరెట్లు వేగవంతం
Truecaller New Update: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ట్రూకాలర్ కొత్త ఐవోఎస్ అప్‌డేట్ లాంచ్ చేసింది. ఫలితంగా యూజర్లకు మరింత మెరుగైన అనుభూతి కలగనుంది. ట్రూ కాలర్ కొత్త అప్‌డేట్ వెర్షన్ గురించి తెలుసుకుందాం..
Truecaller New Update: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ట్రూకాలర్ కొత్త ఐవోఎస్ అప్‌డేట్ లాంచ్ చేసింది. ఫలితంగా యూజర్లకు మరింత మెరుగైన అనుభూతి కలగనుంది. ట్రూ కాలర్ కొత్త అప్‌డేట్ వెర్షన్ గురించి తెలుసుకుందాం..
ట్రూకాలర్ యాప్ అందరికీ సుపరిచితమైంది, విస్తృతంగా వాడుకలో ఉన్న యాప్ ఇది. ఇప్పుడు కొత్త ఐవోఎస్ అప్‌డేట్ లాంచ్ చేసింది ట్రూకాలర్. యూజర్ల అనుభవాన్ని రీస్ట్రక్చర్ చేసింది. కొత్త వెర్షన్ తేలికగా, మరింత సౌకర్యవతంగా ఉంటూ..ఐఫోన్ 6 ఎస్ వంటి డివైస్‌లలో కూడా అద్భుతంగా, వేగంగా పనిచేస్తుందని ట్రూకాలర్ వెల్లడించింది. ఇదొక విస్తృతమైన కాలర్ వివరాలతో పాటు యూజర్ ఎక్స్ పీరియన్స్‌ను పెంపొందిస్తుంది.
ట్రూకాలర్ కొత్త అప్‌డేట్ యూజర్లను అన్‌వాంటెడ్ కాల్స్ నుంచి రక్షించేందుకు దోహదపడుతుంది. స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, కుంభకోణాల గురించి 10 రెట్లు మెరుగ్గా తెలుసుకునే సౌకర్యం కల్పిస్తుంది. యాప్‌పై ట్యాప్ చేయకుండానే నెంబర్ ఎవరిదనేది తెలుసుకునే వీలుంటుంది.
కొత్త అప్‌డేట్‌లో వేగంగా నెంబర్ తెలుసుకునేందుకు వీలుగా ఓవరాల్ విజిట్ కూడా ఉంటుంది. ఐఫోన్ యూజర్లకు కాలర్ ఐడీతో పాటు ఈమోజీ ఉంటుంది. ఐఫోన్ యూజర్లకు కాలర్ ఐడీతోపాటు ఈమోజీ కూడా కన్పిస్తుంది. ట్రూకాలర్ కంపెనీ చేసిన ట్వీట్ ప్రకరాం కొత్త వెర్షన్ 50 శాతం వేగంగా ఉండటమే కాకుండా..50 శాతం చిన్నదిగా ఉంటుంది.
ఈ కొత్త అప్‌డేట్ యాప్..స్పామ్ డిటెక్షన్, కాలర్ ఐడీ, కుంభకోణాల్ని గుర్తించడం, వెరిఫికేషన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. స్పామ్ నెంబర్లను గుర్తించేందుకు కంపెనీ ట్రూకాలర్ గ్రూప్‌పై నమ్మకముంచుతుంది.యూజర్లు ఏం చేయకుండానే..స్పామ్ వివరాలు తెలుసుకోగలరు. అంటే కాల్ వస్తున్నప్పుడే నెంబర్‌ను ట్రూకాలర్ గుర్తిస్తుంది. గతంలో అయితే కాల్ పూర్తయిన తరువాత మాత్రమే ఎవరి నెంబర్ అనేది చూడగలిగేవాళ్లు.
Also read: Reliance Jio: జియో బంపరాఫర్.. రూ.10 లక్షల విలువైన బహుమతులు గెలుచుకునే ఛాన్స్.. ఆఫర్ ఇంకా 4 రోజులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook