Nokia New Phone 2024: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ నోకియా  నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని నోకియా సబ్‌ బ్రాండ్‌ హెచ్‌ఎండీ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లో 'ది బోరింగ్ ఫోన్' అనే పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉండబోతోంది. అలాగే గతంలో నోకియా లాంచ్‌ చేసిన పాత ఓపెన్‌ టప్‌ మొబైల్‌ డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది విభిన్నమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు బేసిక్‌ బోరింగ్‌ ఫీచర్స్‌తో కొత్త మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. అయితే నోకియా కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని ఫ్లిఫ్ స్టైల్‌లో సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో పాటు ఈ ఫ్లిప్ స్టైల్ ఫోన్‌లో ఎలాంటి యాప్స్‌ను అయిన సులభంగా డౌన్‌లోడ్‌ చేసేందుకు ప్రత్యేకమైన యాప్‌ స్టోర్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఇది విభిన్న మోడల్స్‌లో అందుబాటులోకి మార్కెట్‌లో లాంచ్‌ కాబోతోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన గేమ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. 


డిజైన్‌ పరంగా..
ఈ 'ది బోరింగ్ ఫోన్' మొబైల్‌ ప్రత్యేమైన లుక్‌లో కనిపించనుంది. నోకియా ఈ ఫోన్‌ను హోలోగ్రాఫిక్ స్టిక్కర్‌లతో పాటు గ్రీన్‌ కలర్‌ వేరియంట్‌లో ముందుగా మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. దీంతో పాటు ఇది ఆధునాతన సాంకేతికతతో రాబోతోంది. అలాగే ఇది న్యూట్రో ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే, 2.8 అంగుళాల డిస్ప్లేతో అందుబాటులోకి రానుంది. లోపలి భాగం డిప్లే 1.77 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండబోతోంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఇతర ఫీచర్స్‌ విషయానికొస్తే, 0.3MP కెమెరాతో పాటు హెడ్‌ఫోన్ జాక్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు వారం వరకు స్టాండ్‌బై ఉంటుంది. దీంటో ఈ స్మార్ట్‌ఫోన్‌ 2G/3G/4G వంటి కనెక్టివిటీలతో అందుబాటులోకి రాబోతోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌తో రాబోతోంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి