Nothing Phone 2 Expected Price: నథింగ్ కంపెనీ త్వరలోనే రెండవ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కానుంది. నథింగ్ ఫోన్ (2) పేరుతో మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తున్నట్లు కంపెనీ వివరించింది. మంచి గిజైన్‌, స్టైల్‌తో అదుబాటులోకి రావడం వల్ల మంచి సక్సెస్‌ సాధించింది. దీంతో వినియోగదారుల్లో నథింగ్ ఫోన్ (2)పై ఎక్కువ ఆసక్తి పెరిగింది. దీంతో కంపెనీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ (2)కు సంబంధించిన అప్‍డేట్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ అమెరికా, బ్రిటన్‍ల్లో లాంచ్ కానుంది. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్టు నెలలో భారత్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నథింగ్ ఫోన్ (2)లో చాలా రకాల కొత్త ఫీచర్లు లభించబోతున్నాయని సమాచారం. ఇంతక ముందున్న ఫోన్‌ కంటే విభిన్నంగా ఉండబోతోందని టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. 


Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం


నథింగ్‌ తమ ఫోన్ (2)ను ఈ ఏడాది వేసవిలో తీసుకువస్తున్నట్లు ఓ ట్వీట్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అన్ని ఫోన్‌లా ఫ్లాగ్‍షిప్ రేంజ్‍లో ఉండబోతోందని పేర్కొంది. అయితే నథింగ్ ఫోన్ (2) వివరాలు తెలుసుకోవడానికి, అందుబాటులోకి వస్తే కొనుగోలు చేసేందుకు  ఓ వెబ్‍ పేజీని కూడా క్రియేట్ చేసింది నథింగ్‌ కంపెనీ..ఇందులో ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన అన్ని రకాల అప్‍డేట్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా నథింగ్‌ ఈ ఫోన్‌కు సంబంధించిన 3 సెకన్ల వీడియోను కూడా విడుదల చేసింది. 
 
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రీమియమ్ రేంజ్‍లో సాధరణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రాబోతునట్లు నథింగ్ ఫోన్ ఇంతక ముందే తెలిపింది. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ఫ్లాగ్‍షిప్‌తో వినియోగదారుల ముందుకు రాబోతోంది. నథింగ్ ఫోన్ (2)లో ప్రీమియం లుక్‌లో ఎల్ఈడీ లైట్లు కూడా ఉండబోతున్నాయి. అయితే కంపెనీ ఇప్పటికీ నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్లను వివరించలేదు. ఇక ధర విషయానికొస్తే ఫ్లాగ్‍షిప్ స్థాయిలో ఉండబోతోంది. కాబట్టి రూ. 40,000 కంటే తక్కవ ధరలోనే లభించే ఛాన్స్ ఉంది. 


Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook