OnePlus 12R Launch Date: వన్‌పస్‌ లవర్స్‌కి మరో శుభవార్త..ఎప్పటి నుంచో అందరు ఎదురు చూస్తున్న OnePlus 12R స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్‌ను కంపెనీ జనవరి 23న ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో విడుదల చేయబోతోందని వెల్లడించింది. భారత్‌తో పాటు ఇరత దేశాల్లో కూడా  OnePlus 12 సిరీస్‌ను విడుదల చేయబోతున్నట్ల కంపెనీ పేర్కొంది. జనవరి 23 నుంచి భారత మార్కెట్‌లోకి OnePlus 12, OnePlus 12R రెండు మోడల్స్‌ విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు మోడల్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాంచ్‌కి ముందే Amazonలోకి 
OnePlus 12R స్మార్ట్‌ ఫోన్‌ విడుదలకు ముందే అమెజాన్‌లోని మైక్రో-సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ మైక్రో-సైట్‌లో వివరాల ప్రకారం..ఈ మొబైల్‌ బ్లూ, బ్లాక్ అనే రెండు కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఈ OnePlus 12R మొబైల్ మార్కెట్‌లోకి విడుదలైతే  Samsung Galaxy S23 FE వంటి స్మార్ట్‌ ఫోన్స్‌తో పోటి పడనుంది. గతంలో లీక్‌ అయిన వివరాల ప్రకారం..ఈ OnePlus 12R స్మార్ట్ ఫోన్‌ ఐరన్ గ్రే, కూల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేయబోతున్నట్లు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


OnePlus 12R ధర వివరాలు:
ఈ OnePlus 12R స్మార్ట్‌ ఫోన్‌ భారతదేశంలో రెండు(8GB+128GB, 16GB+256GB) కాన్ఫిగరేషన్‌లలో విడుదల కాబోతోంది. దీని ధర రూ. 40,000 ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. ఈ OnePlus 12R మొబైల్‌  చైనాలో లాంచ్‌ చేసిన OnePlus Ace 3 మొబైల్‌ రీబ్రాండెడ్ వెర్షన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ OnePlus Ace 3 స్మార్ట్ ఫోన్‌ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో చైనాలో విడుదలైంది. ఇదే ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. 


OnePlus 12R ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
OLED డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్:

చైనాలో విడుదలైనా OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌  6.7-అంగుళాల LTPO AMOLED డిస్ల్పేతో రాబోతోంది. ఈ డిస్ల్పే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ  OnePlus 12 స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్ గరిష్టంగా 4,500 nits బ్రైట్‌నెస్‌తో రాబోతోంది. ఇది 5500mAh పెద్ద బ్యాటరీతో పాటు 100W SuperVOOC వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter