OnePlus Ace 3V Expected Features And Specifications: ప్రముఖ మొబైల్‌ కంపెనీ వన్‌ప్లస్‌ త్వరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను  OnePlus Ace 3V మోడల్‌తో తీసుకు రాబోతున్నట్లు చైనా వార్త సంస్థలు పేర్కొన్నాయి. అయితే విడుదలకు ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన కొన్ని వివరాలను పలువురు టిప్‌స్టర్స్‌ లీక్‌ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇంతకముందు లాంచ్‌ చేసిన మొబైల్‌ కంటే ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపేనీ ఈ OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్‌ను OnePlus Nord 5 పేరుతో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లీక్‌ అయిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏలాంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుందో? మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weibo తెలిపిన వివరాల ప్రకారం..OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో శక్తివంతమైన ప్రధాన కెమెరాతో రానుంది. ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో  3 కెమెరాలు నిలువు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్స్‌ తెలిపారు. అంతేకాకుండా ఈ కెమెరాల్లో హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్‌ కలిగిన పెరిస్కోపిక్ లెన్స్‌తో కూడా ఓ కెమెరా రాబోతున్నట్లు తెలుస్తోంది.  


ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో వర్టికల్ కెమెరా డిజైన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో భాగంగానే LED ఫ్లాష్ లైట్‌ కూడా అందుబాటోకి రానుంది. ఇక సైడ్‌ సెటప్‌లో భాగంగా వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌ కూడా ఉండబోతోంది. బ్యాక్‌లోని మధ్యలో OnePlus లోగో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ కింది భాగంలో ఫ్లాట్ డిజైన్‌తో రాబోతోంది. 


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


అంతేకాకుండా ఈ OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్‌ ఫ్రాంట్‌ డిజైన్‌లో భాగంగా, సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా ఆకర్శనీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది అదిరిపోయే  1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో వస్తున్నట్లు టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. 


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter