Oneplus Nord Buds 3 Launch Expected Date: ప్రముఖ టెక్‌ కంపెనీ వన్‌ప్లస్‌ వినియోగదారులకు మరో గుడ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలోనే OnePlus Nord Buds 3 ఇయర్‌ బడ్స్‌ విడుదల కానున్నాయి. ఈ బడ్స్‌కి సంబంధించిన సమాచారాన్ని BIS ధృవీకరణ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ ఇయర్‌ బడ్స్‌ను Nord Buds 3 మోడల్‌లో విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. అయితే ఇప్పటికే వన్‌ప్లస్‌ OnePlus 12R, OnePlus 12తో పాటు OnePlus బడ్స్ 3ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే వన్‌ప్లస్‌ Nord Buds 3ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుందని సమాచారం అయితే ఈ ఇయర్‌ బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BIS ధృవీకరణ పొందిన Nord Buds 3 ఇయర్‌ బడ్స్‌:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ధృవీకరణ వెబ్‌సైట్‌లో వన్‌ప్లస్‌ Nord Buds 3 ఇయర్‌ బడ్స్‌ను నమోదు చేసుకుంది. అయితే ఈ ధృవీకరణ భాగంగా ఇప్పటికే  OnePlus Nord Buds 2R ఇయర్‌ బడ్స్‌ E510A మోడల్ నంబర్ పొందగా..వన్‌ప్లస్‌ Nord Buds 2 ఇయర్‌ బడ్స్‌ E508A మోడల్ నంబర్‌ను పొందినట్లు సమాచారం. అయితే ఈ Nord Buds 3 ఇయర్‌ బడ్స్‌కి సంబంధించిన వివరాలు ఈ వెబ్‌సైట్‌లో చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతం కొన్ని ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌, విడుదల తేది అతి త్వరలోనే మార్కెట్‌లోకి విడుదలయ్యే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. 


లీక్‌ అయిన Oneplus Nord Buds 3 ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు:
ఆడియో డ్రైవర్‌ల ఫీచర్‌లు , స్పెక్స్:

ఈ Nord Buds 3 డివైస్ బాస్‌వేవ్ ఎన్‌హాన్స్‌మెంట్ అల్గారిథమ్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాకుండా ఇవి  12.4ఎమ్ఎమ్ టైటానియం డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయని సమాచారం. 


ANC:
వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 25dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో  విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో AI నాయిస్ క్యాన్సిలేషన్ కోసం డ్యూయల్-మైక్ సెటప్‌ను కూడా అందించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌a


బ్యాటరీ:
ఈ ఇయర్‌ బడ్స్‌ అత్యంత శక్తివంతమైన 41mAh బ్యాటరీతో పాటు 7 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా నాన్‌స్టాప్‌గా వీటిని ప్లేబ్యాక్‌లో ANCతో 5 గంటల వరకు  ప్లే చేసుకోవచ్చు. దీంతో పాటు  36 గంటల వరకు అదనపు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. టెక్‌ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఇయర్‌ బడ్స్‌ని మార్చి లేది ఏప్రిల్‌ నెలలో విడుదల చేసే చాన్స్‌ ఉందని సమాచారం. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter