OnePlus Nord CE 3 5G Vs OnePlus Nord CE 3 Lite 5G: వన్‌ప్లస్ మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ తేడాలు తెలుసుకోండి..
Oneplus Nord Ce 3 Vs Ce 3 Lite Which Is Better: అతి తక్కువ ధరలో లభించే వన్‌ప్లస్ మొబైల్స్‌లో OnePlus Nord CE 3 5G, OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్స్‌కి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్‌లో వీటి విక్రయాలు పోటపోటీగా పెరుగుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకోండి.
OnePlus Nord CE 3 5G Vs OnePlus Nord CE 3 Lite 5G: ప్రస్తుతం మార్కెట్‌లో వన్‌ప్లస్ మొబైల్స్‌కి మంచి డిమాండ్ ఉంది. వన్‌ప్లస్ లాంచ్ చేసే ప్రతి స్మార్ట్‌ఫోన్స్‌ను ప్రీమియం ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌తో విక్రయిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది వన్‌ప్లస్ మొబైల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యవతైతే..ప్రీమియం కెమెరాతో కూడిన తక్కువ ధరలో లభించే వన్‌ప్లస్ మొబైల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వన్‌ప్లస్ బ్రాండ్‌లో OnePlus Nord CE 3 5G, OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్స్ మిడిల్ రేంజ్‌లో లభిస్తున్నాయి. అయితే ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సమానంగా ఉండడం వల్ల ఏది కొనుగోలు చేయాలో అని తికమకపడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ వివరాల్లోకి వెళితే..ఈ OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 782G ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ మొబైల్ ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొబైల్ 50MP ప్రధాన కెమెరాతో లభిస్తోంది. ఇక OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే, ఇది Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 108 MP ప్రధాన కెమెరాతో రాబోతోంది. కెమెరా పరంగా చూస్తే ఈ Nord CE 3 Lite 5G మొబైల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.
ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, ఇతర వివరాలు చూస్తే..వన్‌ప్లస్ Nord CE 3 5G మొబైల్ 5000mAh బ్యాటరీతో లభిస్తోంది. అంతేకాకుండా వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ 80W SUPERVOOCతో రాబోతోంది. అలాగే ఈ మొబైల్ 6.7 అంగుళాల AMOLED డిప్ల్పేతో అందుబాటులో ఉంది. ఇది Li-Po 5000mAh బ్యాటరీతో వచ్చింది. ఇక OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే, ఇది కూడా 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ డిప్ల్పే వివరాలు చూస్తే.. ఇది 6.7 అంగుళాల డిప్ల్పేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో లభిస్తోంది.
ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ధరల్లోకి వెళితే.. ఈ Oneplus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ వేరియంట్ ధర రూ.17,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక Oneplus Nord CE 3 5G మొబైల్ ధర విషయానికొస్తే రూ. 23,129 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ధర పరంగా చూస్తే OnePlus Nord CE 3 5G మొబైల్ కాస్త ఎక్కువగా ఉంటుంది. మంచి కెమెరా, పనితీరు కలిగిన మొబైల్‌ను కొనాలనుకునేవారికి OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ చాలా బెస్ట్‌గా భావించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి