OnePlus Pad 2 Price: యాపిల్ ట్యాబ్స్‌ను మించిన ఫీచర్స్‌తో OnePlus Pad 2.. ధర చాలా చీప్!
OnePlus Pad 2 Price: ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదలైన వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2) సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. దీనిని కంపెనీ అమెజాన్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్యాబ్ సంబంధించిన డిస్కౌంట్ పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
OnePlus Pad 2 Price: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ తమ కస్టమర్స్‌కి మరో గుడ్ న్యూస్ తెలపబోతోంది. ఇటీవల జరిగిన సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2) పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే దీనికి సంబంధించిన మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఇది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు వన్‌ప్లస్ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే ఈ వన్ ప్లస్ ప్యాడ్ 2కి సంబంధించిన మైక్రో సైట్ అమెజాన్‌లో లైవ్ అవుతోంది. దీనిని కంపెనీ మిడిల్ రేంజ్ బడ్జెట్ లోనే తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెజాన్‌లో ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2కు సంబంధించిన ధర కూడా అందుబాటులో ఉంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వన్‌ప్లస్ ప్యాడ్ 2కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2)ను MRP ధర రూ.47,999తో విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా భారీ తగ్గింపుతో దీనిని కేవలం రూ.37,999లకు అందించనుంది. అమెజాన్ ఈ టాప్ పై త్వరలోనే డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా తీసుకురాబోతున్నట్లు సమాచారం. వన్ ప్లస్ కంపెనీ ఈ ట్యాబ్‌ను మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటి వేరియంట్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటే.. రెండవది 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఇది 12 ఇంచుల ఎల్సీడి డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది.
ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2) ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్‌ప్లస్ టాబ్లెట్‌కి సక్సెస్‌గా ఇది అందుబాటులోకి వచ్చింది. కంపెనీ గతంలో లాంచ్ చేసిన టాబ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇందులో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ ప్యాడ్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. కంపెనీ ఇందులో జంబో బ్యాటరీని అందుబాటులో ఉంచింది. ఇది 9,510 Mah సామర్థ్యం కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో పాటు ఈ వన్ ప్లస్ ప్యాడ్ 2 ఫ్రంట్ భాగంలో 8mp స్పెషల్ కెమెరాను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా బోలెడు ప్రీమియం ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
12 ఇంచుల ఎల్సీడి డిస్ప్లే
హై రిఫ్రెష్ రేట్
ఎక్కువ బ్రైట్నెస్
అద్భుతమైన కలర్ రెండరింగ్
ఫ్లాగ్షిప్ శక్తివంతమైన ప్రాసెసర్
సీమ్‌లెస్ మల్టీటాస్కింగ్
ఇంప్రెసివ్ కెమెరా సెటప్
అధిక రెసల్యూషన్ మెయిన్ కెమెరా
స్టీరియో స్పీకర్లు
లౌడ్, క్లియర్ ఆడియో
ఫాస్ట్ ఛార్జింగ్
కంఫర్టబుల్ గ్రిప్
లేటెస్ట్ ఫీచర్లు
సెక్యూరిటీ ప్యాచ్‌లు
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి