Oppo A2X Price: భారత మార్కెట్‌లో Oppo స్మార్ట్‌ ఫోన్స్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మొబైల్స్‌ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. అందుకే ఈ కంపెనీ స్మార్ట్‌ ఫోన్స్‌ డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Oppo తమ కొత్త  స్మార్ట్‌ ఫోన్‌ను A2x సిరీస్‌తో లాంచ్‌ అయ్యింది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్స్‌, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Oppo A2x స్మార్ట్ ఫోన్‌ గరిష్టంగా 8 GB ర్యామ్‌, 256 ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే..అతి శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో విడుదలైంది. ఈ మొబైల్‌ ఫోన్‌  డైమెన్షనల్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో బ్లాక్, గోల్డ్, పర్పుల్ మూడు కలర్స్‌లో లభిస్తోంది.  Oppo A2x మొబైల్‌ చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇక ధర వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ ఫోన్‌ 1099 యువాన్లు (దాదాపు రూ. 12,800) ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే కంపెనీ భారత్‌లో కూడా విడుదల చేయబోతోంది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


Oppo A2x స్మార్ట్ ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్‌ఫోన్‌ 720x1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.56 అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు HD + రిజల్యూషన్, టియర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌ డిస్ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ వరకు సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా 8 GB LPDDR4x ర్యామ్‌, 256 GB UFS2.2 స్టోరేజ్‌ ఆప్షన్‌ కలిగి ఉంటుంది. 


ఫీచర్స్‌:
MediaTek Dimension 6020 చిప్‌సెట్‌
LED ఫ్లాష్‌
సింగిల్ కెమెరా సెటప్‌
13 మెగాపిక్సెల్స్ కెమెరా
5 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్‌ కెమెరా
5000mAh బ్యాటరీ
Android 13 ఆధారంగా ColorOS 13.1
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్
IP54 రేటింగ్‌


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి