OPPO Find N2 Flip Review and Specifications: ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ 'ఒప్పో'కు భార‌త్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. నిత్యం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను తమవైపుకు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ఒప్పో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఇటీవలే (17 మార్చి 2023) లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో మాత్రమే విక్ర‌యించ‌బడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన వెంటనే 'సూపర్ హిట్' అని తేలిపోయింది. విడుదలైన వారంలోపే ఫోన్ అమ్మకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo Find N2 Flip Price In India:
ఒప్పో సంస్థ ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ని 17 మార్చి 2023న భార‌త్ మార్కెట్‌లో విడుదల చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఫోన్ స్టాక్ పూర్తిగా అయిపోయింది. ఈ ఫోన్ ధర 90 వేల రూపాయలు ఉన్నప్పటికీ.. హాట్ కేక్ మాదిరి అమ్ముడుపోయింది. ఈ ఫోన్ ఒకే ఒక వేరియంట్‌లో వచ్చింది. 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 89999. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ల ద్వారా ఈ ఫోన్‌పై 10 వేల తగ్గింపు పొందవచ్చు. అపుడు ఈ ఫోన్ రూ.79999కి అందుబాటులో ఉంటుంది.


Oppo Find N2 Flip Specifications:
ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ ఒక గొప్ప ప్రీమియం ఫోన్. అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్ వెలుపల ఉన్న డిస్‌ప్లే పెద్ద ఆకర్షణ. 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 3.26 అంగుళాలు (మడతపెట్టిన ఫోన్‌) ఉంటుంది. ఈ ఫోన్ అతిపెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. మొత్తంగా 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. లోపల డిస్‌ప్లేలో 1600 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ ఉంటుంది.


Oppo Find N2 Flip Battery:
ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ 4300 mAh డ్యూయల్-సెల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 80W SuperVOOC ఛార్జర్‌తో వస్తుంది. అయితే ఇది 44W ఛార్జింగ్‌కు మాత్రమే మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ Android 13 OS మరియు ColorOS 13తో పని చేస్తుంది.


Oppo Find N2 Flip Camera:
ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో 50MP సోనీ IMX890 కెమెరా సెన్సార్ ఉంది. ఇది కాకుండా 8MP అల్ట్రా వైడ్ లెన్స్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. దాంతో ఫొటోస్ అద్భుతంగా వస్తాయి. 


Oppo Find N2 Flip Features:
# 6.8-అంగుళాల e6 ఫోల్డింగ్ డిస్‌ప్లే
# 4nm MediaTek డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్‌
# ColorOS 13 ఆండ్రాయిడ్‌ 13
# 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌
# 50+ 8 (ఫిక్స్‌డ్-ఫోకస్ అల్ట్రావైడ్ షూటర్‌) ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా
# 32 ఎంపీ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా
# 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 4300mAh బ్యాటరీ


Also Read: Best Mileage Cars 2023: 7 లక్షల కంటే తక్కువ ధర.. 34 కిలోమీటర్ల మైలేజ్! స్టైలిష్ లుకింగ్  


Also Read: Toyota Upcoming SUV: టయోటా ఫార్చ్యూనర్ కంటే బలమైన ఎస్‌యూవీ.. శక్తివంతమైన ఇంజన్‌, సూపర్ మైలేజ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.