COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo Reno10 Pro+ 5G Price: అన్ని కంపెనీలు దసరా, దీవాళీ పండగను దృష్టిలో పెట్టుకుని సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్‌ కంపెనీల్లో పండగ సేల్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు చీప్‌గా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ వస్తువులను 50 శాతం తగ్గింపుతో విక్రయిస్తున్నాయి. ఇక ఈ సేల్స్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5,000కు పైగా తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు కొన్ని బ్రాండ్‌లు తమ అధికారిక వెబ్‌సైట్‌లలో కస్టమర్స్‌ను ఆకర్శించేందుకు బహుమతులను కూడా అందిస్తున్నాయి. 


ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. ఈ డీల్‌లో మొబైల్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరలకే పొందడమే కాకుండా అదనంగా డిప్ట్స్‌ను కూడా పొందవచ్చు. ఈ స్పెషల్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు Oppo Reno10 Pro+ 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలోనే లభిస్తుంది. అయితే దీని MRP ధర రూ.54,999కాగా ఈ ఆఫర్‌లో భాగంగా రూ.54,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఫెడరల్, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 4,000 వరకు తక్షణ తగ్గింపును పొందుతారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


దీంతో పాటు మీకు ఒప్పో కంపెనీ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించడానికి, ముందుగా మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.37,450 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో మీరు అన్ని డిస్కౌంట్స్‌ పోను రూ. 17,549కే పొందవచ్చు. అయితే ఈ బోనస్‌ మీరు ఎక్చేంజ్‌ చేసే స్మార్ట్‌ ఫోన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే పై తగ్గింపు లభిస్తుంది. 


Oppo Reno10 Pro+ 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
 256 GB UFS3.1 స్టోరేజ్‌
64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా
2772x1240 పిక్సెల్ రిజల్యూషన్‌
6.74 అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
అడ్రినో 730 GPU
స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌
50-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 
4700mAh బ్యాటరీ
100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌  
ColorOS 13.1


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..