Oppo Reno 12 Series: ఆ ఫోన్‌లో అంతా ఏఐ టెక్నాలజీ ఫీచర్లే, ఇవాళే ఇండియాలో లాంచ్
Oppo Reno 12 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త వేరియంట్ లాంచ్ కానుంది. Oppo Reno 12 సిరీస్‌లో OPPO Reno 12, OPPO Reno 12 Pro వేరియంట్లు ఇవాళ భారత మార్కెట్‌లో రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Oppo Reno 12 Series: పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఒప్పో కంపెనీ ఒప్పో రెనో 12, ఒప్పో రెనో 12 ప్రో ఫోన్లు ఇవాళ లాంచ్ చేస్తోంది. అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్, లార్జ్ స్క్రీన్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇవాళ భారతీయ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
OPPO Reno 12 సిరీస్ ఫోన్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి మీడీయాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో కలర్ ఓఎస్ 14.1 సాఫ్ట్‌వేర్ ఉంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో గొరిల్లా గ్లాస్ 7ఐని అమర్చింది కంపెనీ. ఇక ర్యామ్ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వరకూ అందుబాటులో ఉన్నాయి.
ఒప్పో రెనో 12 సిరీస్‌లో పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ఇందులో AI Eraser 2.0, AI Best Face, AI Studio, AI Recording Summary, AI Writer వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అయితే లార్జ్ స్క్రీన్, హై రిజల్యూషన్, హై రిఫ్రెష్ రేట్‌తో పాటు అద్భుతమైన డిజైన్ ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మల్చిందని చెప్పవచ్చు.
ఇందులో త్రిబుల్ కెమేరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. అదే ఒప్పో రెనో 12 ప్రో అయితే 50 మెగాపిక్సెల్ టెలీఫోటో కెమేరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. దాంతో సెల్ఫీ మరింత అద్భుతంగా ఉంటుంది.
ఒప్పో రెనో 12, ఒప్పో రెనో 12 ప్రో ఫోన్ల ధరల గురించి స్పష్టమైన సమాచారం లేదు గానీ 30 వేల నుంచి 40 వేల మధ్యలో ఉండవచ్చని అంచనా. ఇది కూడా చైనాలో లాంచ్ ధరల్ని బట్టి తెలుస్తున్న అంచనా ధరలు.
Also read: ITR Download Process: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook