Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా Oppo Reno 12 Pro త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ మే నెలాఖరులో ఇండియాలో లాంచ్ కావచ్చు. ఏకంగా 4 కెమేరాలతో 16 జీబీ ర్యామ్, శక్తివంతమైన బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒప్పో రెనో 12 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డైమెన్సిటీ 9200 ప్లస్ స్టార్ స్పీడ్ ఎడిషన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ర్యామ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ వరకూ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 


ఒప్పో నుంచి ఇంతకు ముందు లాంచ్ అయిన Oppo Reno 11 Pro 39,999 వేలకు లాంచ్ అయింది. ఇది 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కలిగింది. ఇది కూడా 80 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు లాంచ్ అయిన ఒప్పో రెనో 12 ప్రోతో పోలిస్తే ర్యామ్, కెమేరా తప్పించి మిగిలిన ఫీచర్లు దాదాపుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒప్పో రెనో 12 ప్రో ధర మరి కాస్త ఎక్కువే ఉండవచ్చు.


ఒప్పో రెనో 12 ప్రోలో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 ఎక్స్ టెలీఫోటోతో 50 మెగాపిక్సెల్ ధర్డ్ కెమేరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ 65 రేటింగ్‌తో యాంటీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఒప్పో రెనో 12 ప్రోలో  f/2.0 ఎపర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ కెమేరా ఉండటంతో రిజల్యూషన్ అద్భుతంగా ఉంటుంది. ఫోటోగ్రఫీని ఎంజాయ్ చేయవచ్చు. 


Also read: Bajaj CNG Bike: 125 సిసి ఇంజన్‌తో బజాజ్ సీఎన్‌జి బైక్ ఫీచర్లు, మైలేజ్ వివరాలు ఇలా, లాంచ్ ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook