Unbreakable Laptop: హెచ్‌పి, డెల్, ఏసస్, లెనోవా, ఎంఐ, ఆపిల్, శాంసంగ్ ఇలా కంపెనీల జాబితా చాలా పెద్దదే ఉంటుంది. ఈ అన్ని కంపెనీల ల్యాప్‌టాప్‌లకు మార్కెట్‌లో ఆదరణ ఎక్కువే. వీటన్నింటికంటే ప్రత్యేకంగా Panasonic సరికొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసింది. ఇది ఎంత ధృడంగా ఉంటుందంటే పై నుంచి గిరాటేసి విసిరికొట్టినా పగలదు. నమ్మలేకున్నారా...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Panasonic కొత్తగా లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ రఫ్ అండ్ టఫ్ వాడకానికి పనిచేస్తుంది. బహుశా అందుకే కంపెనీ ఈ ల్యాప్‌‌టాప్‌కు టఫ్‌బుక్ అని పేరుపెట్టింది. Toughbook 40 Mk 2 పేరుతో లాంచ్ అయినా ఈ ల్యాప్‌టాప్ చాలా ధృడంగా ఉంటుంది. గతంలో లాంచ్ చేసిన Toughbook 40కు ఇది సెకండ్ జనరేషన్ మోడల్. ఈ ల్యాప్‌టాప్ 6 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా పగలదు. నీట్లో పడినా ఏం కాదు. అద్భుతమైన ప్రోసెసింగ్ పవర్, డ్యూరబిలిటీ ఈ ల్యాప్‌టాప్ సొంతం. టఫ్ బుక్ 40 ఎంకే 2  మెటియోర్ కోర్ అల్ట్రా ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 14 ఇంచెస్ హెచ్‌డి ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అంటే ఎండలో కూడా విజిబిలిటీ బాగుంటుంది. గ్లోవ్స్ తొడిగినా టచ్ స్క్రీన్ పనిచేస్తుంది. 


ఈ ల్యాప్‌టాప్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. టఫ్‌బుక్ 40 ఎంకే2 అడ్వాన్స్డ్ ఇంటెల్ BE200, వైఫై 7 కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 4జి లేదా 5జి నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. ఇందులో ఇ సిమ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం. మిలిటరీ ప్రమాణాలతో సర్టిఫై అయింది. ఐపీ 66 రేటింగ్ కావడంతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తుంది. అంటే మైనస్ 20 డిగ్రీల నుంచి 63 డిగ్రీల వరకూ తట్టుకోగలదు. 


ఈ ల్యాప్‌టాప్ మాడ్యులర్ డిజైన్ కలిగి ఉంటుంది. బ్యాటరీ, స్టోరేజ్, మెమరీ వంటి ఫీచర్లు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 54.4 ఎంఎం మందం, 3.35 కిలోల బరువుతో ఉంటుంది. ఇందులో ఇన్ బిల్ట్ 68 వాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 12 గంటలు నిర్విరామంగా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర 4 లక్షల వరకూ ఉంటుంది. 


Also read: Samsung Galaxy S23 Offer: 50MP ట్రిపుల్ కెమేరా, 8GB ర్యామ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సగం ధరకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook