Samsung Galaxy S23 Offer: 50MP ట్రిపుల్ కెమేరా, 8GB ర్యామ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సగం ధరకే

Samsung Galaxy S23 Offer: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ స్థానం ప్రత్యేకం. అద్బుతమైన ఫీచర్లు, కెమేరా రిజల్యూషన్, మన్నికకు పెట్టింది పేరు. శాంసంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో ఇప్పటికే చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి Samsung Galaxy S23.ఈ ఫోన్ ఇప్పుడు నమ్మశక్యం కాని ధరకు లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2024, 01:02 PM IST
Samsung Galaxy S23 Offer: 50MP ట్రిపుల్ కెమేరా, 8GB ర్యామ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సగం ధరకే

Samsung Galaxy S23 Offer: Samsung Galaxy S23 అనేది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ధర వాస్తవానికి 90 వేల రూపాయలు. కానీ ఇప్పుడీ ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ప్రకారం ఈ ఫోన్ ధర సగానికి తగ్గిపోనుంది. కేవలం 43 వేలకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ప్రీమియం ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

Samsung Galaxy S23 ఫోన్ 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1750 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ అయితే 3900 ఎంఏహెచ్ సామర్ధ్యంతో ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుంది. ఇక కెమేరా పరంగా చూస్తే ఇదులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 10 మెగాపిక్సెల్ టెలీఫోటో కెమేరాతో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. ఈ ట్రిపుల్ కెమేరా సెటప్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 3 ఎక్స్ జూమ్ లెన్స్ కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎలాంటి బ్యాంకు ఆఫర్ లేకుండా కంపెనీ ఇచ్చే డిస్కౌంట్ ప్రకారం 46,999 రూపాయలకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్‌ఫినిట్ క్రెడిట్ కార్డు, శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ కార్డు వినియోగించి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. 10 శాతం డిస్కౌంట్ మినహాయిస్తే ఈ ఫోన్ కేవలం 43 వేలకే చేతికి అందనుంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23లో నాలుగు రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ల్యావెండర్, గ్రీన్, ఫ్యాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ నడుస్తోంది. అందుకే ఇది బెస్ట్ ఆఫర్ కాగలదు.

Also read: PM Kisam Scheme: పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News