Poco F6 Price Dropped @28,000: ప్రస్తుతం ఇప్పుడు ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఇంటర్నల్ స్టోరేజ్  ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. అంతేకాకుండా ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్‌ను కోరుకుంటున్నారు. అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ఇలాంటి మొబైల్స్‌ని ఎక్కువగా తయారుచేసి విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా భారత మార్కెట్లో  వన్ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు రియల్ మీ, వివో, పోకో వంటి స్మార్ట్ ఫోన్స్‌కి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. అతి తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్‌తో లభించడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాగే యాపిల్ కంపెనీకి సంబంధించిన ఐ ఫోన్స్ పై కూడా ధరలు తగ్గడంతో వీటిని కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇటీవలే మార్కెట్లోకి మొబైల్స్ ను లాంచ్ చేశాయి. ఇలా లాంచ్ చేసిన మొబైల్స్ కంపెనీల్లో పోకో ఒకటి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం పోకోకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన Poco F6 స్మార్ట్ ఫోన్ కూడా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో లభించబోతోంది. ఇది తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ కంపెనీకి సంబంధించిన మొట్టమొదటి మొబైల్‌గా భావించవచ్చు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్‌లో రూ. 60 వేలకు పైగా లభించే మొబైల్స్‌లో ఉండే ఫీచర్లను ఇందులో అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8GB రామ్ సెట్ అప్‌తో అందుబాటులోకి వచ్చింది.


ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ.29,999 కాగా, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ రూ.33,000తో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే ఫ్లిఫ్‌కార్ట్‌కి సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించే వారికి 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎస్బిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ .2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అలాగే ఈ మొబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి దాదాపు రూ. 28 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వాటిని వినియోగించు కొనుగోలు చేసే వారికి మరింత డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఈ మొబైల్ పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.3 వేయిలలోపే కొత్త మొబైల్ పొందవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి