Poco M6 Pro Price: డెడ్ ఛీప్ ధరకే Poco M6 Pro మొబైల్, స్టాక్ పెట్టిన 10 నిమిషాల్లోనే ఖాళీ..
Poco M6 Pro Price: ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన Poco M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌కి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి డిమాండ్ పెరగడం కారణంగా స్టాక్ పెట్టిన వెంటనే అయిపోతుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Poco M6 Pro Price: గత వారంలో విడుదలైన Poco M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్స్‌లో ఇది ఒకటి..ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండడం వల్ల కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే..ఫుల్ HD + డిస్‌ప్లేతో పాటు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5G సపోర్ట్‌తో.. స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్‌లు కలిగి ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఈ కామర్స్ వెబ్‌సై స్టాక్ పెట్టిన 15 నిమిషాల్లోనే అమ్ముడవుతున్నాయి. అయితే ఈ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Poco M6 Pro 5G అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 4 GB, 64 GB వేరియంట్ ఒకటైతే, 6 GB, 128 GB వేరియంట్ మరొకటి. మొదట కంపెనీ 4 GB, 64 GB వేరియంట్ మొబైల్‌ను రూ. 14,999లకు మార్కెట్‌లోకి విక్రయించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని రూ.10,999లకే విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్స్ పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ క్రమంలో మీరు ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ మొబైల్ ఫోన్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 13,999లకే లభిస్తోంది.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
Poco M6 Pro 5G స్పెసిఫికేషన్‌లు:
Poco M6 Pro 5G మొబైల్ ఫోన్ 6.79 అంగుళాల పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉండడమే కాకుండా.. HD + రిజల్యూషన్, 550 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందులో ఉంచింది కంపెనీ. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇక స్టోరేజ్ వివరాల విషయానికొస్తే..6జిబి ర్యామ్, 128జిబి ఇంబిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా 6జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
ఇతర ఫీచర్లు:
✾ 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
✾ 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
✾ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
✾ 5,000mAh బ్యాటరీ బ్యాకప్
✾ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
✾ ఆండ్రాయిడ్ 13
✾ Wi-Fi 5
✾ 3.5mm హెడ్‌ఫోన్ జాక్
✾ IR బ్లాస్టర్
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి