Poco X5 Pro 5G Smartphone 2023, Poco 5G Smartphones under Rs 25000: చైనీస్ మొబైల్ కంపెనీ 'పోకో'కు భారతదేశంలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమ కస్టమర్ల కోసం పోకో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే పోకో ఎక్స్5 ప్రో 5జీ (Poco X5 Pro 5G)ని రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ విజన్, స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్, 67W ఫాస్ట్ ఛార్జర్, స్టీరియో స్పీకర్లు మరియు అమోల్డ్ డిస్‌ప్లే లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ధర కూడా చాలా తక్కువగా ఉంది. ఈ ఫోన్ చాలా స్టైలిష్‌గా ఉంది. పోకో ఎక్స్5 ప్రో 5జీ ధర మరియు ఫీచర్లను ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco X5 Pro Specifications:
పోకో ఎక్స్5 ప్రో పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 120hz రిఫ్రెష్ రేట్‌తో.. 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పోకో స్మార్ట్‌ఫోన్‌లలో అత్యంత సన్నని ఫోన్. ఈ ఫోన్ మూడు రంగులలో (పసుపు, నలుపు, నీలం) అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అందించబడుతుంది. 


Poco X5 Pro Camera:
పోకో ఎక్స్5 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 16MP కెమెరా ఉంది.


Poco X5 Pro Battery:
పోకో ఎక్స్5 ప్రో ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇది ఇటీవల లాంచ్ అయిన Realme 10 Pro+లో ఉన్న MediaTek Dimensity 1080 SoC కంటే వేగవంతమైనది. ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దాంతో నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. 


Poco X5 Pro Price In India:
పోకో ఎక్స్5 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999లుగా ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 24,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌పై కస్టమర్‌కు 2 వేల రూపాయల తగ్గింపు ఇవ్వబడుతుంది. అప్పుడు ఈ ఫోన్ ధర రూ.20,999కి తగ్గనుంది. ఈ ఫోన్ విక్రయం ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానుంది.


Also Read: Sreeleela Pics: చుడీదార్‌లో శ్రీలీల.. మరీ ఇంత అందమా అంటూ పిచ్చెక్కిపోతున్న ఫాన్స్!


Also Read: Shraddha Das Hot Pics: సిల్వర్ శారీలో శ్రద్ధా దాస్.. చాలా శ్రద్దగా నెలవంక నడుమును చూపిస్తూ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.