Poco X6 Neo Price: ప్రముఖ టెక్‌ కంపెనీ Poco మార్కెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ మొబైల్‌ను కంపెనీ POCO X6 నియో మోడల్‌తో విడుదల చేసింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంతక ముందే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రసారం చేసింది. అయితే నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.  ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా కంపెనీ వెల్లడించింది. ఇది ఎంతో శక్తివంతమైన ప్రీమియం ఫీచర్స్‌తో అందుమాటులోకి వచ్చింది. అయితే ఈ POCO X6 నియో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ POCO X6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభించబోతోంది. ఇందులోని 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ధర MRP రూ.19,999తో లభించబోతోంది. అయితే ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా ఫ్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఫ్లాట్‌ తగ్గింపు ఆఫర్‌లో భాగంగా 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను కేవలం రూ. 15,999కే పొందవచ్చు. దీంతో పాటు దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌..ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే, దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, HDFC, SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.14,999కే లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్ ఆఫర్‌ను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ POCO X6 నియో స్మార్ట్‌ఫోన్‌ 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అలాగే కెమెరాతో పాటు మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది. దీని డిజైన్‌లో భాగంగా 7.69 మిమీ థిన్ బాడీతో వచ్చింది. దీంతో పాటు ఇది 2312FRAFDI  మోడల్ నంబర్‌తో లభిస్తోంది. ఇవే కాకుండా చాలా రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


పోకో ఎక్స్‌6 నియో టాప్ 10 ఫీచర్స్:
❀ 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే
❀ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్
❀ స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్
❀ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్
❀ 48MP ట్రిపుల్ రియర్ కెమెరా
❀ 16MP సెల్ఫీ కెమెరా
❀ 5000mAh బ్యాటరీ
❀ 67W టర్బో ఫాస్ట్ చార్జింగ్
❀ MIUI 13 ఇంటర్‌ఫేస్
❀ IR బ్లాస్టర్
❀ స్టీరియో స్పీకర్లు


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి